హిట్‌ మీ ఛాలెంజ్‌.. నెటిజన్ల మండిపాటు

Shweta Tiwari And Other Stars Take Hit Me Challenge Netizens Slammed - Sakshi

లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో ఉంటూ బోరింగ్‌గా ఫీల్‌ అవుతున్న వారి కోసం సోషల్‌ మీడియా వేదికగా అనేక కొత్త ఛాలెంజ్‌లు రూపొందుతున్నాయి. ఇటీవల ‘హిట్‌ మీ ఛాలెంజ్’‌ అనే ఛాలెంజ్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. కొంతమంది కలిసి ఒకరినొకరు కొట్టుకున్నట్లు నటించడమే ఈ ఛాలెంజ్‌ ప్రత్యేకత. ప్రస్తుతం ఈ సవాల్‌ను బాలీవుడ్‌ బుల్లితెర నటులు స్వీకరించారు. టెలివిజన్‌ స్టార్స్‌ శ్వేతా తివారీ, కరణ్‌ వీర్, వికాస్‌ కలంత్రి, షరద్‌ మల్హోత్రా, డెబినా బోనెన్నర్జీతో సహా పలువురు నటులు కలిసి హిట్‌ మీ ఛాలెంజ్‌ వీడియో రూపొందించారు. ఈ వీడియోలో ముందుగా శ్వేతా.. ఒకరిని కొట్టడంతో మొదలవ్వగా, అలా ఒకరినొకరు కొట్టుకుంటూ పోతారు. ఎవరి చేతికి దొరికిన వస్తువులను వాళ్లు ఉపయోగిస్తూ ఎదుటి వారిపై దాడికి యత్నిస్తారు. (నేను అతన్ని ప్రేమిస్తున్నాను: హీరోయిన్‌ )

ఈ క్రమంలో టీవీ రిమోట్‌, చీపురు, క్రికెట్‌ బ్యాట్‌, యాపిల్‌ ఇలా ఒక్కొ వస్తువును ఆయుధంగా ఉపయోగిస్తూ చివరికి డోనాల్‌ బిష్ట్‌.. క్రిప్‌ కపూర్‌ కంటిపై ఎటాక్‌ చేస్తుంది. అయితే తిరిగి ఆమెను ఎదుర్కొలేని అతను తన గిలార్‌ ట్యూన్‌ ప్లే చేస్తూ ఈ పోరాటానికి ముగింపు పలికాడు. అయితే ప్రతి ఒక్కరు తమ ఇంట్లోనే ఉంటూ ఈ వీడియోను రూపొందించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను శ్వేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఇది చాలా సరదాగా ఉంది. ఈ ఛాలెంజ్‌ గురించి నాకు ఎవరో చెప్పినప్పుడు నేను దీన్ని చేయాలని అనుకున్నాను’ అనే క్యాప్షన్తో షేర్‌  చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియలో వైరలవ్వడంతో టీవీ నటుల తీరుపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనన లభిస్తోంది. ‘ఫన్నీగా ఉంది. కానీ ఇలా కొట్టుకోవడం ఎందుకు ఏదైనా నిర్మాణాత్మకంగా చేయండి’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘ఇది మాకు నచ్చలేదు. మీరు గృహహింసను ప్రోత్సహిస్తున్నారు’ అంటూ మరో నెటిజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. (బాహుబలి-2 నా జీవితాన్ని మార్చిన సినిమా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top