నేను అతన్ని ప్రేమిస్తున్నాను: హీరోయిన్‌ | Esha Gupta Makes Relationship with Boyfriend Manuel Campos Guallar | Sakshi
Sakshi News home page

నేను అతన్ని ప్రేమిస్తున్నాను: హీరోయిన్‌

Apr 28 2020 3:26 PM | Updated on Apr 28 2020 4:26 PM

Esha Gupta Makes Relationship with Boyfriend Manuel Campos Guallar - Sakshi

ముంబై : గత కొంత కాలంగా స్పెయిన్‌కు చెందిన బిజినెస్‌మెన్‌ మాన్యువల్‌ కాంపోస్‌ గుల్లార్‌తో డేటింగ్‌లో ఉన్న బాలీవుడ్‌ హీరోయిన్‌ ఇషా గుప్తా మంగళవారం తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. మాన్యువల్‌తో ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేస్తూ, సోషల్‌ మీడియలో ఓ పోస్ట్‌ చేశారు. ఇద్దరు నలుపు రంగు దుస్తుల్లో దిగిన చిత్రాన్ని షేర్‌ చేస్తూ..  ‘ఐ లవ్‌ యూ సో మచ్‌ మై లవ్‌.’ అంటూ స్పానిష్‌ భాషలో తన ప్రియుడిపై ఉన్న ప్రేమను చాటుకుంది. ఇక ఇషా చేసిన ఈ పోస్టును ఇప్పటికే లక్ష మంది లైక్‌ చేశారు. (అది నా జీవితంలో గొప్ప సినిమా: ప్రభాస్‌ )

te amo mucho mi amor ♥️

A post shared by Esha Gupta🌎 (@egupta) on

లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఇషా ముంబైలో నివసిస్తుండగా.. మాన్యూల్‌ స్పెయిన్‌లో స్వీయ నిర్భంధంలో ఉన్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..  మాన్యూల్‌ స్పెయిన్‌లోని తన ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అతడి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నేను ప్రతి రోజు అతనితో వీడియో కాల్‌ మాట్లాడుతున్నాను. అతని ఆరోగ్యం గురిం‘చి శ్రద్ధ తీసుకుంటున్నాను. అతను చాలా కూల్‌. నన్నెప్పుడూ సంతోంషంగా ఉంచుతాడు’. అని చెప్పుకొచ్చింది. కాగా ఇషా గతంలో భారత క్రికెటర్‌ హార్థిక్‌ పాండ్యాతో ప్రేమ వ్యవహారం కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే హార్ధిక్‌ ప్రస్తుతం సెర్భియా మోడల్‌ నటాషా స్టాంకోవిచ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు.(కనికా కపూర్ సంచలన నిర్ణయం )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement