అది నా జీవితంలో గొప్ప సినిమా: ప్రభాస్‌ | Baahubali 2 Comletes 3 Years: Prabhas Shares A Pic From Sets | Sakshi
Sakshi News home page

బాహుబలి-2 నా జీవితాన్ని మార్చిన సినిమా: ప్రభాస్‌

Apr 28 2020 2:34 PM | Updated on Apr 28 2020 3:23 PM

Baahubali 2 Comletes 3 Years: Prabhas Shares A Pic From Sets - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత చిత్రకావ్యం బాహుబలి. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచదేశాలకు పరిచయం చేసి, బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించింది ఈ సినిమా. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా, పవర్‌ఫుల్‌ విలన్‌గా రానా నటించారు. బాహుబలి‌, భల్లాలదేవ పాత్రల్లో ఇద్దరూ నువ్వా-నేనా అన్నట్లు పోటీపడి నటించారు. ఈ సినిమాతో ప్రభాస్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బాహుబలి-2 ది కన్‌క్లూజన్’‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో(మంగళవారం) సరిగ్గా మూడేళ్లు పూర్తి అవుతోంది. ఈ నేపథ్యంలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బాహుబలి చిత్ర బృందానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో అతిపెద్ద సినిమా అని, ఎప్పటికీ గుర్తిండేపోయే మధుర జ్ఞాపకమని  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ('ప్రభాస్‌ను నేను పెళ్లి చేసుకోవడం లేదు')

‘బాహుబలి-2 కేవలం సినిమా మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందిన చిత్రం. నా జీవితంలో అతిపెద్ద సినిమా. నా అభిమానులకు బాహుబలి చిత్ర యూనటి్‌కు, అద్భుత చిత్రంగా తీర్చిదిద్దిన రాజమౌళికి రుణపడి ఉంటాను. బాహుబలి-2 పూర్తి అయి మూడు సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఇంతటి గొప్ప చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా.. మీ అందరి ప్రేమలకు కృతజ్ఞుడిని’. అంటూ షూటింగ్‌ సమయంలో రానా, రాజమౌళితో కలిసి ఉన్న ఓ స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. కాగా బాహుబలి మొదటి భాగం 2015లో విడుదలవ్వగా.. రెండో భాగం 2017 ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
(ఇటలీ పార్ట్‌.. హైదరాబాద్‌లోనే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement