యాక్టింగ్‌కు గుడ్‌ బై | shraddha kapoor Goodbye for acting 2018 | Sakshi
Sakshi News home page

యాక్టింగ్‌కు గుడ్‌ బై

Dec 30 2018 12:39 AM | Updated on Jul 17 2019 10:14 AM

shraddha kapoor Goodbye for acting 2018 - Sakshi

శ్రద్ధా కపూర్‌

... అంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌. అదేంటీ అనుకుంటున్నారా? ఆమె ఇక నటించను అని చెప్పింది ఈ ఏడాదిలో మాత్రమే. కొత్త ఏడాది స్టార్ట్‌ కావడానికి ఇక రెండు రోజులే ఉన్నాయి కదా. అందుకే సరదాగా అలా అన్నారన్నమాట. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ సినిమా షూట్‌లో ఆమె దాదాపు 15 గంటలు పాల్గొన్నారు.

‘‘సాహో’ సినిమా సెట్‌లో ఒక రోజులో 15గంటలు పాల్గొన్నాను. 2018కి ఇక షూటింగ్‌ ముగిసింది. ఈ ఏడాది ఇక నటించను’’ అని పేర్కొన్నారు శ్రద్ధాకపూర్‌. నీల్‌నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, ఎవెలిన్‌ శర్మ, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్‌ తదితరులు నటించిన ‘సాహో’ చిత్రం 2019 ఆగస్టు 15న విడుదల కానుంది. అలాగే బాలీవుడ్‌లో శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ కూడా వచ్చే ఏడాది క్రిస్మస్‌కు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా హిందీ చిత్రాలు ‘ఛిచోరే, సైనా’తో బిజీగా ఉన్నారామె.

Advertisement
 
Advertisement
Advertisement