సూర్యుడివో చంద్రుడివో... | sarileru neekevvaru movie song launch | Sakshi
Sakshi News home page

సూర్యుడివో చంద్రుడివో...

Dec 10 2019 5:53 AM | Updated on Dec 10 2019 5:53 AM

sarileru neekevvaru movie song launch - Sakshi

మహేశ్‌బాబు

మహేశ్‌బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని రెండో పాటని సోమవారం విడుదల చేశారు చిత్రబృందం. ‘సూర్యుడివో చంద్రుడివో...’ అనే పల్లవితో సాగే ఈ పాట ఫ్యామిలీ మెలోడీగా అలరిస్తోంది. మహేశ్‌బాబు, రష్మికా మందన్నా జంటగా విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర, ‘దిల్‌’ రాజు, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా జనవరి 11 విడుదలవుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించిన  ‘సూర్యుడివో చంద్రుడివో...’ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటని ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్‌ బి.ప్రాక్‌ పాడారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్‌ సాంగ్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘సూర్యడివో...’ పాట ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేశారు’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement