ముగ్గురున్నారు.. ముక్కోణం కాదు! | Sara Ali Khan, Akshay Kumar and Dhanush to shoot Atrangi Re | Sakshi
Sakshi News home page

ముగ్గురున్నారు.. ముక్కోణం కాదు!

Feb 13 2020 12:46 AM | Updated on Feb 13 2020 12:46 AM

Sara Ali Khan, Akshay Kumar and Dhanush to shoot Atrangi Re - Sakshi

సారా అలీఖాన్, అక్షయ్, ధనుష్‌

ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్‌ ఉంటే కచ్చితంగా అది ముక్కోణపు ప్రేమకథా చిత్రం అని చాలామంది ఊహిస్తారు. ఇప్పుడు అక్షయ్‌కుమార్‌–ధనుష్‌–సారా అలీఖాన్‌ నటించబోతున్న హిందీ చిత్రం ‘అట్రంగీరే’ ఆ టైప్‌ సినిమానే అనుకుంటున్నారు. ‘‘ముగ్గురు ఉన్నప్పటికీ ఇది ముక్కోణపు ప్రేమకథా చిత్రం కాదని, ప్రచారంలో ఉన్నట్లు అక్షయ్‌ది అతిథి పాత్ర కాదు’’ అని చిత్రదర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ స్పష్టం చేశారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌  మార్చి లో బీహార్‌లో ప్రారంభం కానుంది.

‘‘తొలి షెడ్యూల్‌లో ధనుష్, సారాలపై చిత్రీకరిస్తాం. తర్వాత మధురైలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఈ రెండు షెడ్యూల్స్‌ తర్వాత ఏప్రిల్‌లో జరిగే చిత్రీకరణలో అక్షయ్‌ కుమార్‌ పాల్గొంటారు. జూలై కల్లా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. కేవలం ఒక జానర్‌కి చెందిన చిత్రం కాదు ఇది. సంగీతానికి ప్రాధాన్యం ఉంది. అందుకే ఏఆర్‌ రెహమాన్‌ను తీసుకున్నాం’’ అన్నారు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌. ‘అట్రంగీ రే’ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల రోజున విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement