హత్య చేసిందెవరు? | sambavam movie began in Hyderabad | Sakshi
Sakshi News home page

హత్య చేసిందెవరు?

Jan 11 2017 11:44 PM | Updated on Sep 5 2017 1:01 AM

హత్య చేసిందెవరు?

హత్య చేసిందెవరు?

సాగర్, స్వప్నిక జంటగా నండూరి వీరేశ్‌ దర్శకత్వంలో గూన అప్పారావు నిర్మిస్తున్న ‘సంభవం’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

సాగర్, స్వప్నిక జంటగా నండూరి వీరేశ్‌ దర్శకత్వంలో గూన అప్పారావు నిర్మిస్తున్న ‘సంభవం’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌ రావు క్లాప్‌ ఇవ్వగా, మాజీ ఎంపీ ఆవుల వీరశేఖర్‌ కెమేరా స్విచ్చాన్‌ చేశారు. వ్యాపారవేత్త బాబా భాయ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే హారర్‌–థ్రిల్లర్‌ చిత్రమిది. హత్య చేసిందెవరు? అనేది ప్రస్తుతానికి  సస్పెన్స్‌’’ అన్నారు నండూరి వీరేశ్‌.

‘‘మా సంస్థ నిర్మించిన ‘లవ్‌ స్పాట్‌’, ‘గురుబ్రహ్మ’ చిత్రాల్ని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు గూన అప్పారావు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement