కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చిన సమంత | Samantha Reveals Reasons Behind not Doing Movies | Sakshi
Sakshi News home page

కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చిన సమంత

Sep 17 2016 11:05 AM | Updated on Sep 4 2017 1:53 PM

కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చిన సమంత

కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చిన సమంత

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలు మొదలైన దగ్గర నుంచి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త సినిమాలకు సైన్ చేయటం లేదు.

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలు మొదలైన దగ్గర నుంచి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త సినిమాలకు సైన్ చేయటం లేదు. త్వరలో పెళ్లి పీటలెక్కుతున్న కారణంగానే కొత్త సినిమాలకు అంగీకరించటం లేదన్న ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో, తను సినిమాలు ఎందుకు అంగీకరించటం లేదో స్పష్టత ఇచ్చింది. మంచి పాత్రలు రానందు వల్లే సినిమాలు ఒప్పకోవటం లేదని సమంత తెలిపింది.

'దక్షిణాది సినీరంగంలో హీరోయిన్లుకు అర్థవంతమైన పాత్రలు దొరకటం ఎంత కష్టమో ఇప్పుడిప్పెడే అర్ధమవుతోంది. కేవలం మంచి పాత్రలు రాని కారణంగా ఇంత వరకు ఏ సినిమాను అంగకీరించలేదు. ఈ విషయం చెప్పటం నాకేంతో బాధ కలిగిస్తోంది.' అంటూ ట్వీట్ చేసింది. జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ కొట్టిన సమంత ఆ సినిమా తరువాత ఇంత వరకు ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement