జోడీ సెట్‌? | Sai Pallavi in Sharwanandh's next film? | Sakshi
Sakshi News home page

జోడీ సెట్‌?

Jul 24 2017 12:32 AM | Updated on Sep 5 2017 4:43 PM

జోడీ సెట్‌?

జోడీ సెట్‌?

రన్‌ రాజా రన్, ఎక్స్‌ప్రెస్‌ రాజా, శతమానం భవతి... ఇలా సూపర్‌ హిట్స్‌తో దూసుకెళుతోన్న శర్వానంద్, మలయాళ ‘ప్రేమమ్‌’తో తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన సాయి పల్లవి జంటగా నటించనున్నారా? అంటే ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అవుననే అంటున్నాయి.

రన్‌ రాజా రన్, ఎక్స్‌ప్రెస్‌ రాజా, శతమానం భవతి... ఇలా సూపర్‌ హిట్స్‌తో దూసుకెళుతోన్న శర్వానంద్, మలయాళ ‘ప్రేమమ్‌’తో తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన సాయి పల్లవి జంటగా నటించనున్నారా? అంటే ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. ‘ఫిదా’లో భానుమతిగా సాయి పల్లవి నటన, ఆమె అందానికి ఇటు ఫిల్మ్‌ ఇండస్ట్రీ అటు ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో సాయి పల్లవికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే నాని హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఎమ్‌.సి.ఎ. (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) చిత్రంలో నటిస్తోన్న ఈ మలయాళ బ్యూటీ శర్వానంద్‌ హీరోగా రూపొందనున్న సినిమాకి ఓకే చెప్పారట. ఇంకొన్ని అవకాశాలున్నప్పటికీ ఆచి తూచి అడుగులేయాలని సాయి పల్లవి అనుకుంటున్నారట.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement