'ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు' | S S Rajamouli tweets about Bahubali-3 | Sakshi
Sakshi News home page

'ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు'

Oct 25 2015 6:43 AM | Updated on Jul 14 2019 4:08 PM

'ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు' - Sakshi

'ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు'

తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసికెళ్లిన 'బాహుబలి' చిత్రానికి సంబంధించి పలు పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ తెర దించుతూ ఓ క్లారిటీ ఇచ్చాడు బాహుబలి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి.

తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసికెళ్లిన 'బాహుబలి' చిత్రానికి సంబంధించి పలు పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ తెర దించుతూ ఓ క్లారిటీ ఇచ్చాడు బాహుబలి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి-2 షూటింగ్ ఇంకా షురూ కాకముందే.. బాహుబలి-3 గురించి చర్చ జోరుగా సాగుతుంది. దాంతో రాజమౌళి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులకి అసలు విషయం చెప్పారు.

బాహుబలి కథ పార్ట్ 2 తోనే ముగుస్తుందని, బాహుబలి-3 ఉండదని తేల్చేశారు. అయితే బాహుబలి-2 మాత్రం ఇంతకు ముందెప్పుడూ కలిగించని అనుభూతిని కలిగిస్తుందని జక్కన్న వివరించారు. సమయం వచ్చినప్పుడు అన్నీ సవివరంగా చెప్తానని.. రూమర్స్ని నమ్మొద్దంటూ ట్వీట్ చేశారు. ఏం జరుగుతుందనేది తనకు మాత్రమే తెలుసునని వెల్లడించారు రాజమౌళి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement