ముసుగుల వెనుక రహస్యం | Romantic Criminals Movie Official Trailer | Sakshi
Sakshi News home page

ముసుగుల వెనుక రహస్యం

May 11 2019 12:49 AM | Updated on May 11 2019 12:49 AM

Romantic Criminals Movie Official Trailer - Sakshi

మనోజ్‌ నందన్, అవంతిక

‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ, ఒక క్రిమినల్‌ ప్రేమ కథ’ లాంటి సందేశాత్మక, కమర్షియల్‌ హిట్‌ చిత్రాలు తీసిన పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్‌ క్రిమినల్స్‌’. మనోజ్‌ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక ముఖ్య తారలుగా నటించారు. ఎక్కలి రవీంద్రబాబు, బి.బాపిరాజు నిర్మించిన ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్‌ వచ్చింది. బి.బాపిరాజు మాట్లాడుతూ–‘‘ముసుగుల వెనుక వున్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా  తీర్చిదిద్దాం. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజినీరింగ్‌ కాలేజ్‌ స్టూడెంట్స్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ, ఒక క్రిమినల్‌ ప్రేమ కథ’ చిత్రాల్ని మించిన వినోదంతో పాటు చక్కటి మెసేజ్‌ ఉంటుంది’’ అన్నారు పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సుధాకర్‌ మారియో, సహనిర్మాతలు: వైద్యశ్రీ డాక్టర్‌ ఎల్‌ఎన్‌ రావు, డాక్టర్‌ కె.శ్రీనివాస్‌.

Advertisement
 
Advertisement
Advertisement