పక్కా మాస్ యాక్షన్.. ‘టచ్ చేసి చూడు’ | Raviteja Touch Chesi Chudu Teaser | Sakshi
Sakshi News home page

Jan 6 2018 10:28 AM | Updated on May 9 2024 11:15 AM

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున‍్న ఈ సినిమాతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాశీఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రీతమ్ సంగీత దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. 

రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేయటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న రవితేజ, టీజర్ లో మాస్ యాక్షన్ తో అదరగొట్టాడు. రాజా ది గ్రేట్ తో సత్తా చాటిన రవితేజ టచ్ చేసి చూడుతో అదే ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement