ఆగస్టు 15న రాంగోపాల్ వర్మ కుమార్తె పెళ్లి | Ramgopal Verma's daughter Revathi to marry on August 15 | Sakshi
Sakshi News home page

ఆగస్టు 15న రాంగోపాల్ వర్మ కుమార్తె పెళ్లి

Aug 6 2013 12:40 PM | Updated on Aug 28 2018 4:30 PM

ఆగస్టు 15న రాంగోపాల్ వర్మ కుమార్తె పెళ్లి - Sakshi

ఆగస్టు 15న రాంగోపాల్ వర్మ కుమార్తె పెళ్లి

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కుమార్తె రేవతి పెళ్లి దేశ స్వాతంత్ర్య దినోత్సవం.. అంటే ఈనెల 15వ తేదీన జరగనుంది.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కుమార్తె రేవతి పెళ్లి దేశ స్వాతంత్ర్య దినోత్సవం.. అంటే ఈనెల 15వ తేదీన జరగనుంది. ప్రణవ్ అనే వైద్యునితో అత్యంత నిరాడంబరంగా ఈ వివాహం జరగనున్నట్లు సమాచారం. బాగా సన్నిహిత మిత్రులు, కొత్త దంపతుల బంధువులను మాత్రమే పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. రాంగోపాల్ వర్మ కుమార్తె రేవతి కూడా మెడిసిన్ చదువుతున్నారు. ప్రణవ్తో ఆమె ప్రేమలో పడగా, ఇద్దరి పెద్దలు పెళ్లికి అంగీకరించారు. ఈ సంవత్సరం జనవరిలో వాళ్ల వివాహ నిశ్చితార్థం జరిగింది.

ప్రముఖుల ఇళ్లలో పెళ్లిలా ఇది భారీగా ఉండబోదని, బాగా సన్నిహితులను, కుటుంబ సభ్యులను మాత్రమే పిలిచి నిరాడంబరంగా పెళ్లి చేయాలనుకుంటున్నారని రాంగోపాల్ వర్మ కుటుంబానికి సన్నిహత వర్గాలు తెలిపాయి. తెలుగు సినీ పరిశ్రమలో వర్మకు బాగా సన్నిహితులను కూడా పిలవనున్నారు. ఇక ఇతర సెలబ్రిటీలెవరూ ఈ పెళ్లిలో కనపడకపోవచ్చని సమాచారం.

పెళ్లికి ముందు రేవతి - ప్రణవ్ తమ స్నేహితుల కోసం ఓ పెద్ద పార్టీ ఇవ్వబోతున్నారని, అందులో దంపతుల సన్నిహిత మిత్రులు మాత్రమే ఉంటారు తప్ప సినీ పరిశ్రమకు చెందిన వారెవ్వరూ ఉండబోరని వర్మ కుటుంబ సన్నిహితులు తెలిపారు. పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు సంతోషంగా అంగీకరించారని తెలిసింది. ప్రణవ్ తల్లిదండ్రులు కూడా వైద్యులేనని, వారు దుబాయ్లో స్థిరపడ్డారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement