నవంబర్‌లో ఇస్టార్ట్‌ | Ram Pothineni and Kishore Tirumala to team up for the third time | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో ఇస్టార్ట్‌

Oct 3 2019 12:18 AM | Updated on Oct 3 2019 12:18 AM

Ram Pothineni and Kishore Tirumala to team up for the third time - Sakshi

రామ్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సక్సెస్‌తో ఇస్మార్ట్‌ ఎనర్జీతో ఉన్నారు రామ్‌. అదే ఎనర్జీతో నెక్ట్స్‌ సినిమా షురూ చేయడానికి రెడీ అయ్యారు. నవంబర్‌ నుంచి కొత్త సినిమా సెట్లో అడుగుపెడతారట రామ్‌. ‘నేను.. శైలజ, ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాలను రామ్‌తో తెరకెక్కించిన కిశోర్‌ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ మూడో సినిమాకు ఓ వెరైటీ కథ అనుకున్నారని సమాచారం. నవంబర్‌ నెలలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. తమిళ చిత్రం ‘తడమ్‌’కి ఇది రీమేక్‌ అట. ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించనున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటించనున్నారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement