ఆ ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది: వర్మ | Ram Gopal varma Tweet a Funny Video With A Song About Modi And Trump | Sakshi
Sakshi News home page

ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉంది: వర్మ

Apr 23 2020 8:21 AM | Updated on Apr 23 2020 1:02 PM

Ram Gopal varma Tweet a Funny Video With A Song About Modi And Trump - Sakshi

కాంట్రావర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. సమాజంలో జరిగే అనేక విషయాల మీద ఫోకస్‌ పెట్టి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతుంటాడు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ పర్యటనపై పలు సరదా ట్వీట్‌లు చేసిన వర్మ మరోసారి ట్రంప్‌పై ట్వీట్‌ చేసి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి ట్రంప్‌, మోదీ మధ్య స్నేహాన్ని ఉద్ధేశిస్తూ వర్మ ఫన్నీ ట్వీట్‌ చేశారు. వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘దీన్ని ఎడిట్‌ చేసిన ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది’. అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు. (టిక్‌టాక్‌ యువతికి ఆర్జీవీ బంపర్‌ ఆఫర్‌)

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, మమ్ముట్టి కలిసి నటించిన దళపతి సినిమాలోని ‘సింగారాల పైరుల్లోన బంగారాలే పండెనంట’ పాట తమిళ వర్షన్‌ను జత చేర్చారు. ఈ పాటలో రజినీ, మమ్ముట్టి స్థానంలో మోదీ ట్రంప్‌లను చేర్చి వాళ్లు ఒకరికొకరు పోటి పడుతూ పాట పాడుతున్నట్లు ఎడిట్‌ చేశారు. ఇక ఈ ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్లు వర్మపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆర్టీవీలో ఇలాంటి హ్యూమర్‌ కోణం కూడా ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఈ పాట తెలుగులో అయితే ఎలా ఉంటుందో కూడా ఎడిట్‌ చేసి ఆ వీడియోను కామెంట్‌లో పెట్టారు. గతంలో ట్రంప్‌ మోదీ మధ్య స్నేహ బంధానికి సంబంధించిన ఓ వీడియో టిక్‌టాక్‌లో ట్రెండ్‌ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా వర్మ ట్వీట్‌ చేసిన ఈ వీడియో మరో సంచలనం‌ సృష్టిస్తుందేమో వేచి చూడాలి. (కేటీఆర్‌ గారు.. నా ముక్కు పచ్చడైంది : వర్మ)

Advertisement
 
Advertisement
Advertisement