ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే! | Rakul Preet Singh Clarity Relation With Rana Daggubati | Sakshi
Sakshi News home page

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

Nov 7 2019 7:42 AM | Updated on Nov 7 2019 7:42 AM

Rakul Preet Singh Clarity Relation With Rana Daggubati - Sakshi

సినిమా: ఆ నటుడితో ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. ఈ అమ్మడికి అవకాశాలు తగ్గినా, వార్తల్లో మాత్రం ఎక్కువగానే ఉంటోంది. ప్రత్యేకంగా ఫొటో సెషన్స్‌ చేసుకుని ఆ ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తూ నెటిజన్లకు పనిచెబుతోంది. తన అభిమానులను ఖుషీ పరుస్తోంది. అదేవిధంగా ప్రేమలో పడిందని, అవకాశాలు తగ్గడంతో పెళ్లి ఆలోచనలో పడిందని అలాంటి ప్రచారాలు రకుల్‌ప్రీత్‌సింగ్‌ గురించి ప్రచారం వైరల్‌ అవుతోంది. అయితే తను మాత్రం అవకాశాలు తగ్గడం కాదని, తానే తగ్గించుకుంటున్నానని, నటనకు అవకాశం ఉన్న పాత్రలైతేనే నటించడానికి అంగీకరిస్తున్నానని చెప్పుకొస్తోంది. ఏదేమైనా ఇంతకు ముందు టాలీవుడ్‌లో చాలా బిజీగా ఉన్న రకుల్‌ప్రీత్‌సింగ్‌కు ఇప్పుడక్కడ ఒక్క అవకాశం కూడా లేదన్నది వాస్తవం. ఇకపోతే కోలీవుడ్‌లో నటుడు కార్తీతో రోమాన్స్‌ చేసిన దేవ్, ఆయన సోదరుడు సూర్యతో నటించిన ఎన్‌జీకే చిత్రాలు నిరాశపరిచినా, లక్కీగా ఇక్కడ శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌తో జతకట్టే అవకాశాన్ని దక్కించుకుంది.అదే విధంగా హిందీలో రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీ టాలీవుడ్‌ నటుడు రానా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు ప్రచారం జోరందుకుంది.

దీంతో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ స్పందించక తప్పలేదు. ఈ అమ్మడు ఒక భేటీలో పేర్కొంటూ నటుడు రానాకు తనకు మధ్య ప్రేమ అన్నది శుద్ధ అబద్ధం అని స్పష్టం చేసింది. తమ ఇద్దరి ఇళ్లు చాలా సమీపంలోనే ఉన్నాయని, తమ ఇళ్ల మధ్య రెండు నిమిషాల్లో వెళ్లేంత దూరమేనని చెప్పింది. తాను సినీరంగంలోకి వచ్చినప్పటి నుంచే నటుడు రానా తనకు తెలుసని పేర్కొంది. అయితే తానాయనతో ఎప్పుడూ డేటింగ్‌ చేయలేదని చెప్పింది. అప్పటికే రానా ప్రేమలో ఉన్నారని అంది. తామిద్దం స్నేహితులుగానే మెలిగినట్లు తెలిపింది. అంతే కాదు తాను నటించిన నటులందరితోనే సన్నిహితంగా ఉంటానని, అలాగే రానాతోనూ తనకున్నది ఫ్రెడ్‌షిప్నే కానీ ప్రేమ కాదని చెప్పింది. తానింత వరకూ ఎవరినీ ప్రేమించలేదని అంది. ఇప్పటికీ తాను సింగిల్‌నేనని తెలిపింది. రానా తనకు తెలిసినప్పటికే ప్రేమలో ఉన్నారని మరో చర్చకు దారులు తెరిచిందీ బామ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement