‘న్యూటన్‌’ను కోర్టుకు లాగుతున్నారే! | Rajkummar Rao Newton in Legal Trouble | Sakshi
Sakshi News home page

Mar 2 2018 6:51 PM | Updated on Apr 3 2019 6:34 PM

Rajkummar Rao Newton in Legal Trouble - Sakshi

న్యూటన్‌ చిత్రంలో రాజ్‌కుమార్‌ రావ్‌

సాక్షి, సినిమా : గతేడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్‌ చిత్రం న్యూటన్‌ చిక్కుల్లో పడింది. ఈ చిత్రం తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) ఎస్సై ఒకరు ఫిర్యాదు చేయటంతో వ్యవహారం కోర్టుకు చేరింది. 

చిత్రంలో తమను(సీఆర్‌పీఎఫ్‌) తక్కువ చేసి చూపారని.. తమ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ సీఆర్‌పీఎఫ్‌ సబ్‌ ఇన్సెపెక్టర్‌ ఒకరు ఢిల్లీలోని కార్కాడూమ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో క్రిమినల్‌ ఫిర్యాదుతోపాటు న్యూటన్‌ నిర్మాతలపై ఆయన పరువు నష్టం దావా  వేశారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహించే ఓ సన్నివేశం ద్వారా తమ మనోభావాలను దెబ్బతీశారంటూ ఫిర్యాదుల్లో ఆయన పేర్కొన్నారు. 

ఈ ఫిర్యాదులను స్వీకరించిన కోర్టు ఏప్రిల్‌ 3న విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. అమిత్‌ వీ మసూర్‌కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌ రావ్‌, పంకజ్‌ త్రిపాఠి, అంజలి పాటిల్‌ తదితరులు నటించారు.  ఆస్కార్ ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో లిస్ట్‌లో చోటు దక్కించుకున్న న్యూటన్.. చివరి జాబితాలో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ 63వ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ కథ కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement