డిసెంబర్‌ 29న ‘మై డియర్‌ మార్తాండం’ | Prudhvi My Dear Marthandam Theatrical Trailer | Sakshi
Sakshi News home page

‘మై డియర్‌ మార్తాండం’ ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌

Dec 25 2018 10:08 AM | Updated on Dec 25 2018 10:08 AM

Prudhvi My Dear Marthandam Theatrical Trailer - Sakshi

‘మై డియర్‌ మార్తాండం’ ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, రాకేందు మౌళి, కల్పికా గణేష్, జయ ప్రకాష్ రెడ్డి ప్రధాన పాత్రల్లో కోర్టు రూమ్ డ్రామా కామెడి ఇంటరాగేషన్స్ జోనర్‌లో తెరకెక్కిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’.  ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ను అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ విడుదల చేశారు.  ఈ సందర్భంగా సందీప్‌  మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుంది. పృథ్వి కామెడీ టైమింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ క్రిస్మస్‌కు సినీ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకొని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

హీరో రాకేందు మౌళి మాట్లాడుతూ  ‘మా సినిమా పుల్ లెంగ్త్‌ కామెడి సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కించాం. చాలా బాగుంటుంది’ అని తెలిపారు. దర్శకుడు హరీష్ కె.వి మాట్లాడుతూ ‘సినిమా చాలా బాగా వచ్చింది, కోర్టు రూమ్ డ్రామా, కామెడి ఇంటరాగేషన్స్ బ్యాక్‌ డ్రాప్‌లో కథ నడుస్తుంది, సినిమాలో పృథ్వి గారి కామెడి చాలా బాగా వచ్చింది, ఈ డిసెంబర్ 29 న వస్తున్నాం. ప్రేక్షకులు ఆధరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement