ఆ నటి క్షేమమేనట | Pregnant Rani is perfectly fine: Spokesperson | Sakshi
Sakshi News home page

ఆ నటి క్షేమమేనట

Nov 17 2015 6:32 PM | Updated on Oct 2 2018 4:31 PM

ఆ నటి క్షేమమేనట - Sakshi

ఆ నటి క్షేమమేనట

బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఆరోగ్యంగానే ఉన్నారని ఆమె ప్రతినిధి మంగళవారం వెల్లడించారు.

ముంబై:  బాలీవుడ్ హీరోయిన్ , ఆదిత్య చోప్రా భార్య రాణి  ముఖర్జీ   ఆరోగ్యంగానే ఉన్నారని ఆమె ప్రతినిధి మంగళవారం వెల్లడించారు.     రాణి  ఇటీవల దీపావళి సంబరాల సందర్భంగా  అస్వస్థతకు గురయ్యారు.   బాలీవుడ్  సూపర్ స్టార్  అమితాబ్ బచ్చన్ నివాసంలో  జరిగిన వేడుకల్లో  రాణి ముఖర్జీ తీవ్రంగా అలసిపోయి, కళ్లు తిరిగి పడిపోయారనే  వార్తలు బాలీవుడ్ లో  షికారు చేశాయి. 

 

దీనిపై ఆమె ప్రతినిధి స్పందిస్తూ...   ప్రస్తుతం రాణీ ముఖర్జీ  క్షేమంగానే ఉన్నారని, అంతా బాగానే ఉందని తెలిపారు.  ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటున్నారని, మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణ అవసరమన్నారు. ఆమెకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమన్న వైద్యుల సలహాపై  గురువారం వరకు ఆమె ఆసుపత్రిలోనే ఉంటారన్నారు. కాగా  కుచ్ కుచ్ హోతా హై హీరోయిన్ గత ఏడాది దర్శకుడు ఆదిత్య చోప్రాని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం రాణి ముఖర్జీ గర్భవతి. 2016 జనవరిలో ఆమె  ఓ  బిడ్డకు జన్మనివ్వనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement