అదంతా నటనలో భాగమే..! | Preeti Desai: Not insecure about Abhay romancing actresses | Sakshi
Sakshi News home page

అదంతా నటనలో భాగమే..!

Published Tue, Jan 28 2014 10:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అదంతా నటనలో భాగమే..! - Sakshi

అదంతా నటనలో భాగమే..!

నటనను కెరీర్‌గా ఎంచుకున్న తర్వాత అన్ని రకాల సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందని, వేటినీ నిజజీవితంలో భాగమనుకోవడానికి వీల్లేదని చెబుతోంది ప్రీతి దేశాయ్.

నటనను కెరీర్‌గా ఎంచుకున్న తర్వాత అన్ని రకాల సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందని, వేటినీ నిజజీవితంలో భాగమనుకోవడానికి వీల్లేదని చెబుతోంది ప్రీతి దేశాయ్. మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ సుందరి నటుడు అభయ్ డియోల్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అభయ్ ఇతర హీరోయిన్లతో శృంగార సన్నివేశాల్లో పాల్గొన్న దృశ్యాలను చూస్తే మీకేదైనా అభద్రతాభావం కలుగుతుందా? అని అడిగినప్పుడు ప్రీతి పైవిధంగా సమాధానమిచ్చింది. ఓ వార్తా సంస్థతో ఆమె మంగళవారం మాట్లాడుతూ... ‘అభయ్ విషయంలో నాకెలాంటి అభద్రతాభావం లేదు. ఎందుకంటే శృంగార సన్నివేశాలనేవి సినిమాల్లో ఓ భాగమే. మిగతా సన్నివేశాల్లో నటించినట్లుగానే శృంగార సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుంది. అంతమాత్రాన అభయ్‌ను తప్పుబట్టాల్సిన అవసరం లేదు.
 
అంతెందుకు నా తొలి చిత్రం ‘షోర్ ఇన్ ద సిటీ’ చిత్రంలో కూడా పలు శృంగార సన్నివేశాల్లో నేను నటించాల్సి వచ్చింది. ఇదంతా వృత్తిలో భాగమే. నిజజీవితానికి వాటిని అన్వయించుకోవాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇక అభయ్ గురించి చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవాలి. సినీ పరిశ్రమ అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పింది అభయ్. మేమిద్దరం భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగినవారమైనప్పటికీ ఎప్పుడూ భేదాభిప్రాయాలు రాలేదు. ఎవరి అభిరుచులు వారివి. పరస్పరం వాటిని గౌరవించుకుంటాం కూడా.
 
ఏదైనా సందేహముంటే వెంటనే అభయ్‌ను సంప్రదిస్తా. అతని అభిప్రాయమేందో తెలుసుకుంటా. ఇద్దరం సదరు విషయం గురించి మాట్లాడుకుంటాం. అయితే అభయ్ గురించి పరిశ్రమలో చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. అతను చాలా అహంకారి అని అంటుంటారు. నిజానికి అలాంటి అహంభావాన్ని నేను గమనించలేదు. కాకపోతే కొత్తవారితో తొందరగా కలిసిపోయే రకం కాదు. ఇక మా పెళ్లి ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. కెరీర్‌ను ఇప్పడే ప్రారంభించానని అనుకుంటున్నా. ఇందులో స్థిరపడాలి. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తా’నని చెప్పింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement