ప్రాణం ఖరీదు ఎంత? | Pranam Khareedu Movie Releasing Soon | Sakshi
Sakshi News home page

ప్రాణం ఖరీదు ఎంత?

Nov 16 2018 2:31 AM | Updated on Nov 16 2018 2:31 AM

Pranam Khareedu Movie Releasing Soon - Sakshi

ప్రశాంత్

ప్రశాంత్, అవంతిక జంటగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్‌.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో యన్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రాణం ఖరీదు’ కథ వినగానే యూనిట్‌ అందరికీ బాగా నచ్చింది. అందుకే ఖర్చుకు వెనకాడకుండా అమెరికాలో 8 రోజులు, హైదరాబాద్‌ 45 రోజులు షూటింగ్‌ పూర్తి చేశాం.

అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పి.ఎల్‌.కె. రెడ్డి మాట్లాడుతూ–  ‘‘పక్కా కమర్షియల్‌ లవ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. అనుకున్నదానికంటే ఔట్‌ పుట్‌ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రానికి ‘వందేమాతరం’ శ్రీనివాస్‌గారి సంగీతం, ఆర్‌.ఆర్‌ ఓ హైలైట్‌’’ అన్నారు. షఫి, ‘జెమిని’ సురేశ్, ‘చిత్రం’ శ్రీను, ఫణి రాజమౌళి, సంజన తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: మురళి మోహన్‌ రెడ్డి.
 

Advertisement
 
Advertisement
Advertisement