చిన్న సినిమాలను ప్రోత్సహించాలి | Pranam Khareedu Movie Audio Launch | Sakshi
Sakshi News home page

చిన్న సినిమాలను ప్రోత్సహించాలి

Mar 12 2019 2:27 AM | Updated on Jul 12 2019 4:40 PM

Pranam Khareedu Movie Audio Launch - Sakshi

ప్రశాంత్, అవంతిక

‘‘అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్‌ సినిమా మీద ప్యాషన్‌తో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం చూసాను. ప్రశాంత్‌ బాగా నటించాడు. మరో మంచి నటుడు ఇండస్ట్రీకి వస్తున్నాడు. చిన్న సినిమాలను అందరూ ప్రోత్సహించాలి’’ అని నిర్మాత కె.ఎల్‌.దామోదర ప్రసాద్‌ అన్నారు. ప్రశాంత్, అవంతిక జంటగా పియల్‌కె రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. ఎన్‌యస్‌ క్రియేషన్స్‌ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ‘వందేమాతరం’ శ్రీనివాస్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత కె.యల్‌.దామోదర ప్రసాద్‌ విడుదలచేశారు.

పియల్‌కె రెడ్డి మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సుబ్బారెడ్డిగారు అన్నివిధాలా సహకరించి సపోర్ట్‌ చేశారు. శ్రీనివాస్‌ మంచి పాటలు ఇచ్చారు. యాక్షన్, సెంటిమెంట్‌ సీన్స్‌లో ప్రశాంత్‌ బాగా నటించాడు. మేము ఊహించిన దానికంటే అవంతిక బాగా చేశారు’’ అన్నారు.  ‘‘సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేసేలా ఉంటుంది’’ అని నల్లమోపు సుబ్బారెడ్డి అన్నారు. ‘‘మా సినిమా ఎవర్నీ నిరుత్సాహ పరచదు’’ అన్నారు ప్రశాంత్‌. ‘‘ప్రాణం ఖరీదు’ నా మూడో చిత్రం. ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను’’ అని అవంతిక చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement