మరోసారి జోడీగా...

Prabhu, Madhubala reunite after 23 years in College Kumar - Sakshi

‘అల్లరి ప్రియుడు, జెంటిల్‌మేన్, చిలక్కొట్టుడు, గణేష్‌’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగుప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మధుబాల. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ‘అంతకుముందు ఆ తర్వాత, సూర్య వర్సెస్‌ సూర్య, నాన్నకు ప్రేమతో’ సినిమాల్లోనూ ముఖ్య పాత్రలతో తనదైన ముద్ర వేశారామె. అటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తున్న మధుబాల తాజాగా ‘కాలేజ్‌ కుమార్‌’ అనే మరో తమిళ చిత్రం అంగీకరించారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో నటుడు ప్రభుతో కలిసి ఆమె నటిస్తుండటం విశేషం. సీమాన్‌ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘పాంచాలకురుచ్చి’ సినిమాలో తొలిసారి జోడీ కట్టారు మధుబాల, ప్రభు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించింది లేదు. తాజాగా అరుణ్‌ విజయ్‌ హీరోగా, ప్రియా వడ్లమాని జంటగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాలేజ్‌ కుమార్‌’ చిత్రంలో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు మధు–ప్రభు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top