‘సాహో’ టీం మరో సర్‌ప్రైజ్‌ | Prabhas Saaho The Game Trailer | Sakshi
Sakshi News home page

‘సాహో’ టీం మరో సర్‌ప్రైజ్‌

Aug 13 2019 2:10 PM | Updated on Aug 13 2019 5:26 PM

Prabhas Saaho The Game Trailer - Sakshi

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన అడ్వంచరస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సాహో. ఈ నెల 30 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా దాదాపు 350 కోట్లతో యూవీ క్రియేషన్‌ సంస్థ సినిమాను రూపొందించింది. ఇప్పటికే టీజర్‌ ట్రైలర్‌లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

సాహో గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను తన సోషల్‌ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు ప్రభాస్‌. యాక్షన్ జానర్‌లోరూపొందించిన ఈ గేమ్‌లో లీడ్ క్యారెక్టర్‌గా ప్రభాస్‌ కనిపిస్తున్నాడు. ఇంటెన్స్‌ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌తో రూపొందించిన ఈ గేమ్ టీజర్‌కు మంచి రెస్సాన్స్‌ వస్తోంది. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేష్, చుంకీ పాండే, అరుణ్ విజయ్‌, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడి, మహేష్‌ మంజ్రేకర్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement