పెళ్లిలో రూ. 37 కోట్లు డిమాండ్‌ చేసింది! | Parineeti Chopra to Demand Rs 37 Crore from Nick Jonas | Sakshi
Sakshi News home page

రూ. 37 కోట్లు డిమాండ్‌ చేసింది!

Oct 18 2018 7:41 PM | Updated on Oct 18 2018 7:54 PM

Parineeti Chopra to Demand Rs 37 Crore from Nick Jonas - Sakshi

ఆయనేమి తక్కువ తిన్నాడా? ఆమె అడిగినంతా ఇవ్వనని కరాఖండీగా చెప్పేశాడు.

కాబోయే బావగారిని ఏకంగా 37 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసిందట బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా. ఆయనేమి తక్కువ తిన్నాడా? ఆమె అడిగినంతా ఇవ్వనని కరాఖండీగా చెప్పేశాడు. పరిణీతి సోదరి ప్రియాంక చోప్రా, నిక్‌ జొనాస్‌ వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పెళ్లి వేడుకల్లో భాగంగా ‘జూతా చురానా’ ఆట ఆడతారు. పెళ్లి కొడుకు చెప్పులను మరదళ్లు దొంగిలించి దాచేస్తారు. డబ్బులు ఇస్తేనే చెప్పులు తిరిగిస్తారు. ఉత్తరాది పెళ్లి వేడుకల్లో ఈ ఆట తప్పసరిగా ఉంటుంది.

డబ్బుల గురించి పెళ్లికి ముందే నిక్‌ జొనాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ‘బాలీవుడ్‌ హంగామా’ తో పరిణీతి చెప్పింది. ‘మా బావగారిని 5 మిలియన్‌  డాలర్లు (సుమారుగా రూ. 37 కోట్లు) ఇవ్వాలని డిమాండ్‌ చేశాను. అలాగే అని చెప్పి 10 డాలర్లు మాత్రమే ఇస్తానని ఆయన అన్నారు. ఇంకా చర్చలు నడుస్తున్నాయి. అయితే నేను ఎంత అడిగినా ఇస్తారు. ఎందుకంటే నేను ఆయన ప్రియమైన మరదలిని’ అంటూ చెప్పుకొచ్చింది.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ప్రియాంక, నిక్‌ పెళ్లి జరగనుందని సమాచారం. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరుపుతారట. పెళ్లికి 200 మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించాలని అనుకుంటున్నారట. ఆగస్టు 18న ప్రియాంక, నిక్‌ నిశ్చితార్థం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement