విలువలు.. బంధాలు.. వెటకారం | Oorantha Anukuntunnaru Teaser Launch | Sakshi
Sakshi News home page

విలువలు.. బంధాలు.. వెటకారం

Apr 8 2019 4:17 AM | Updated on Apr 8 2019 4:17 AM

Oorantha Anukuntunnaru Teaser Launch - Sakshi

మేఘా, నవీన్, సోఫియా

నవీన్‌ విజయకృష్ణ, శ్రీనివాస్‌ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్‌ హీరో హీరోయిన్లుగా బాలాజి సానల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్‌.ఎన్‌. రెడ్డి, ఎ. పద్మనాభరెడ్డి నిర్మించారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరో సాయిధరమ్‌ తేజ్‌ ముఖ్య అతిథులుగా హాజరై ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఇంద్రగంటి మాట్లాడుతూ– ‘‘నవీన్‌ మంచి నటుడే కాదు బ్రిలియంట్‌ ఎడిటర్‌ కూడా.

ఈ సినిమా పోస్టర్‌ చూస్తుంటే నాకు ‘అష్టా చమ్మా’ రోజులు గుర్తుకు వస్తున్నాయి. పల్లెటూరి ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ సినిమా టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌. రాధాకృష్ణన్‌ మంచి సంగీతం ఇచ్చారు. నిర్మాత శ్రీహరిగారు మూడు పాటలు రాశారని తెలిసింది’’ అన్నారు. ‘‘నవీన్‌ మా ఫ్యామిలీ మెంబర్‌లాంటి వాడు. నేను లో ఫేజ్‌లో ఉన్నప్పుడు నాకో పిల్లర్‌లా ఉన్నాడు. మంచి సినిమా చేశారు. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు సాయిధరమ్‌ తేజ్‌.

‘‘ఈ సినిమా నాకు ఆశీర్వాదంలా వచ్చింది. ఒక కుటుంబంలా కలిసి ఈ సినిమా చేశాం’’ అన్నారు నవీన్‌. ‘‘నవీన్, అవసరాల ఇద్దరూ బాగా నటించారు. బాబు కెమెరా వర్క్, రాధాకృష్ణన్‌ సంగీతం ఓ ఆకర్షణ’’ అన్నారు బాలాజి. ‘‘నవీన్‌తో వర్క్‌ చేయడం హ్యాపీ. ప్రేక్షకులు మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తారు’’ అన్నారు రాధాకృష్ణన్‌. ‘‘మంచి సినిమా చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు శ్రీహరి. ‘‘పల్లెటూరి విలువలు, బంధాలు, వెటకారం ఇలా అన్ని అంశాలను సినిమాలో వడ్డించాం’’ అన్నారు నిర్మాత పద్మనాభరెడ్డి. ‘‘బాలాజీ గొప్ప దర్శకుడు అవుతాడు’’ అన్నారు పి.ఎల్‌.ఎన్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement