ఎన్టీఆర్ సినిమా పటాస్ డైరెక్టర్ తోనే..? | Ntr Next movie with Anil ravipudi | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ సినిమా పటాస్ డైరెక్టర్ తోనే..?

Nov 5 2016 1:41 PM | Updated on Sep 4 2017 7:17 PM

ఎన్టీఆర్ సినిమా పటాస్ డైరెక్టర్ తోనే..?

ఎన్టీఆర్ సినిమా పటాస్ డైరెక్టర్ తోనే..?

జనతా గ్యారేజ్ సక్సెస్తో కెరీర్లో బిగెస్ట్ హిట్ అందుకున్న ఎన్టీఆర్, తన నెక్ట్స్ సినిమా విషయంలో ఎటూ తేల్చూకోలేకపోతున్నాడు. జనతా గ్యారేజ్ రిలీజ్కు ముందు రచయిత వక్కంత వంశీని దర్శకుడిగా...

జనతా గ్యారేజ్ సక్సెస్తో కెరీర్లో బిగెస్ట్ హిట్ అందుకున్న ఎన్టీఆర్, తన నెక్ట్స్ సినిమా విషయంలో ఎటూ తేల్చూకోలేకపోతున్నాడు. జనతా గ్యారేజ్ రిలీజ్కు ముందు రచయిత వక్కంత వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా ఉంటుందని ప్రకటించిన జూనియర్ తరువాత ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, వివి వినాయక్ లాంటి దర్శకుల పేర్లు వినిపించినా.. వారంతా బిజీగా ఉండటంతో ఇంత వరకు ఏ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రాలేదు.

అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ అంధుడిగా నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్పై త్వరలోనే కార్లిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement