దిల్ రాజు బ్యానర్లో హిట్ సినిమా సీక్వల్ | Nikhil confirms Karthikeya Sequel | Sakshi
Sakshi News home page

దిల్ రాజు బ్యానర్లో హిట్ సినిమా సీక్వల్

May 19 2017 1:52 PM | Updated on Sep 5 2017 11:31 AM

దిల్ రాజు బ్యానర్లో హిట్ సినిమా సీక్వల్

దిల్ రాజు బ్యానర్లో హిట్ సినిమా సీక్వల్

ఈ శుక్రవారం కేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్, తరువత చేయబోయే సినిమాలను కూడా వరుసగా

ఈ శుక్రవారం కేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్, తరువత చేయబోయే సినిమాలను కూడా వరుసగా లైన్లో పెట్టాడు. ఇప్పటికే రెండు రీమేక్లకు కమిట్ అయిన ఈ యంగ్ హీరో తన హిట్ సినిమాకు సీక్వల్ను కూడా లైన్లో పెట్టాడు. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో విజయం సాధిస్తున్న నిఖిల్ తన సూపర్ హిట్ సినిమా కార్తికేయకు సీక్వల్ను రెడీ చేస్తున్నాడు.

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ కార్తికేయ. ఈ సినిమాకు సీక్వల్ చేసే ఆలోచన ఉందంటూ హీరో, డైరెక్టర్ చాలా కాలంగా చెపుతున్నారు. అయితే నిఖిల్ అప్పటికే కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉండటం, చందూ కూడా ప్రేమమ్తో మరో హిట్ సాధించటంతో కార్తికేయ సీక్వల్ డిలే అవుతూ వచ్చింది. ఈ గ్యాప్లో చందూ ఇతర హీరోలతో సినిమా చేయాలని భావించినా ఏదీ సెట్స్ మీదకు రాలేదు.

దీంతో మరోసారి నిఖిల్తో కార్తికేయ సీక్వల్ను సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు దర్శకుడు చందూ మొండేటి. హీరో నిఖిల్ కార్తికేయ సీక్వల్ను అఫీషియల్గా ఎనౌన్స్ చేశాడు. ప్రస్తుతం కేశవ ప్రమోషన్లో బిజీగా ఉన్న నిఖిల్, చందూ దర్శకత్వంలో కార్తికేయ సీక్వల్ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని తెలిపాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా కార్తికేయకు పర్ఫెక్ట్ సీక్వల్ అని, ఆ సినిమా ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే రెండో భాగం మొదలవుతుందని తెలిపాడు. అయితే టాలీవుడ్లో సీక్వల్ సినిమాలు హిట్ అయిన దాఖలాలు చాలా తక్కువు మరి బాహుబలి తరుహాలో ఆ సెంటిమెంట్ను కార్తికేయ కూడా బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement