'ఆ దేవుడికి కూడా తెలీదు' | Neither father Salim Khan nor God knows when Salman Khan will get married | Sakshi
Sakshi News home page

'ఆ దేవుడికి కూడా తెలీదు'

Aug 13 2016 5:45 PM | Updated on Sep 4 2017 9:08 AM

'ఆ దేవుడికి కూడా తెలీదు'

'ఆ దేవుడికి కూడా తెలీదు'

బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ వివాహంపై ఆయన తండ్రి, వెటరన్ రైటర్ అయిన సలీమ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ వివాహానికి సంబంధించిన ఏదో ఒక వార్త మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా.. సల్మాన్ తండ్రి, వెటరన్ రైటర్ అయిన సలీమ్ ఖాన్.. కుమారుడి వివాహంపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సల్మాన్ పెళ్లి ఎప్పుడు చేస్కుంటాడనే విషయం తనకే కాదు, ఆ దేవుడికి కూడా తెలీదంటూ సలీమ్ ఖాన్ ట్వీట్ చేశారు. ఆయన త్వరలో ఓ రేడియో షోను హోస్ట్ చేయనున్నారు. అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

'ఆ కార్యక్రమంలో మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తాను.. సల్మాన్ ఎప్పుడు పెళ్లి చేస్కుంటున్నాడు అనే ఒక్క ప్రశ్నకు తప్ప. ఎందుకంటే ఆ విషయం నాకే కాదు, ఆ భగవంతుడికి కూడా తెలీదు' అంటూ సలీమ్ చమత్కరించారు. సలీమ్ ఖాన్ లోకల్ ఎఫ్ఎమ్ రేడియోలో 'ది 70ఎమ్ ఎమ్ షో' అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేయబోతున్నారు. వారాంతరాలలో 2 గంటలపాటు ఆ కార్యక్రమం ప్రసారం అవుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement