ఆయన వల్లే ఈ సినిమా స్టార్ట్‌ అయింది | Neevevaro Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

ఆయన వల్లే ఈ సినిమా స్టార్ట్‌ అయింది

Aug 20 2018 1:04 AM | Updated on Jul 14 2019 1:28 PM

Neevevaro Movie Pre Release Event - Sakshi

ఆది పినిశెట్టి, తాప్సీ

‘‘వైజాగ్‌ వాతావరణం చెన్నైకి దగ్గరగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. నా నేటివ్‌ ప్లేస్‌కి వచ్చిన ఫీలింగ్‌ ఉంది. ‘నీవెవరో’ సినిమా వంద శాతం సక్సెస్‌ అవుతుంది’’ అని హీరో ఆది పినిశెట్టి అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్లుగా హరినాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్‌ కార్పొరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. వైజాగ్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘కోన వెంకట్‌గారు చెబితేనే ఈ కథ విన్నాను. బాగా నచ్చింది. ఈ సినిమా ఆయన వల్లే స్టార్ట్‌ అయ్యింది.

మా చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. కోన వెంకట్‌ మాట్లాడుతూ– ‘‘వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో 2003లో విడుదలైన ‘వెంకీ’ చిత్రం రైటర్‌గా నాకొక స్థానాన్ని కల్పించింది. ఆ రోజు నుంచి నా సినిమాల్లో వైజాగ్‌ సెంటిమెంట్‌గా మారిపోయింది. 50 సినిమాలకు పైగా రచయితగా పనిచేశాను. ఎంత గొప్ప కథ రాసినా ఆ కథను తెరపై పండించేది నటీనటులే. ‘నీవెవరో’ సినిమాకు ఆది ప్రాణం పోశారు. తన కెరీర్‌లో ఇదో మైలురాయి అవుతుంది’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ప్రేక్షకులు పెద్ద హిట్‌ చేస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు ఎం.వి.వి.సత్యనారాయణ. సప్తగిరి, వైజాగ్‌ మేయర్‌ మళ్ల విజయ ప్రసాద్, వైజాగ్‌ సత్యానంద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement