నాది రొమాంటిక్ ఫిజిక్ : కేథరిన్ | My romantic Physik says Katherine | Sakshi
Sakshi News home page

నాది రొమాంటిక్ ఫిజిక్ : కేథరిన్

Aug 8 2013 12:14 AM | Updated on Sep 1 2017 9:42 PM

నాది రొమాంటిక్ ఫిజిక్ : కేథరిన్

నాది రొమాంటిక్ ఫిజిక్ : కేథరిన్

హీరోలకు పరాజయాలతో నిమిత్తం ఉండదు. ఓ సినిమా ఫ్లాపైనా... మరో సినిమా కచ్చితంగా ఉంటుంది. కానీ హీరోయిన్లకే సమస్యంతా. వరుసగా రెండు ఫ్లాపులోస్తే చాలు... ‘ఇక ఇంటికే’ అనేస్తారు.

హీరోలకు పరాజయాలతో నిమిత్తం ఉండదు. ఓ సినిమా ఫ్లాపైనా... మరో సినిమా కచ్చితంగా ఉంటుంది. కానీ హీరోయిన్లకే సమస్యంతా. వరుసగా రెండు ఫ్లాపులోస్తే చాలు... ‘ఇక ఇంటికే’ అనేస్తారు. కానీ కేథరిన్ కెరీర్ మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతోంది. తొలి సినిమా ‘చెమ్మక్‌చెల్లో’ ఫ్లాప్. రెండో సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’ కూడా సో.. సో... అనిపించుకుంది. 
 
 మూడో సినిమా ‘పైసా’ విడుదలకు పురిటి నెప్పులు పడుతోంది. కానీ... వీటితో సంబంధం లేకుండా... ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు పోటెత్తుతున్నాయి. దీంతో ఈ దుబాయ్ భామ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. ‘‘నిజానికి నేను సినిమాల్లోకి వెళ్లడం నాన్నకు ఇష్టం లేదు. నేను సక్సెస్ కాలేనని ఆయన అనుమానం. కానీ ఇప్పుడు మాత్రం నాన్న చాలా హ్యాపీ. వరుసగా పెద్ద పెద్ద ఆఫర్లు వస్తుంటే... చెప్పలేనంత అనందంగా ఉంది’’ అంటున్నారు కేథరిన్. 
 
 మీలోని ప్రధాన ఆకర్షణ ఏంటి? అనడిగితే- ‘‘నా కళ్లు. అవి చాలా అమాయకంగా ఉంటాయంటారు అందరూ. అంతేకాదు... నా ఫిజిక్ కూడా రొమాంటిగ్గా ఉంటుందని నా ఫ్రెండ్స్ అభిప్రాయం’’ అంటూ పకపకా నవ్వేశారు కేథరిన్. పూరిజగన్నాథ్ తాజా చిత్రంలో కథానాయికగా కేథరిన్ ఎంపికయ్యిందని విశ్వసనీయ సమాచారం. దీంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ సరసన కూడా ఓ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ నటించనున్నట్లు వినికిడి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement