‘వాళ్లు దేవుళ్లయితే ఇక్కడ నేనూ దేవుణ్నే’ | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 13 2018 2:20 PM

Mohan Babu Gaythri Teaser - Sakshi

కలెక్షన్‌ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గాయత్రి. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అంతేకాదు చాలా కాలం తరువాత ఆయన ఈ సినిమా పూర్తి స్థాయి ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మంచు విష్ణు, శ్రియ, నిఖిలా విమల్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు సినిమా మీద మంచి హైప్ క్రియేట్‌ చేశాయి. తాజాగా ఇంట్రస్టింగ్ డైలాగ్స్ తో ఆసక్తికరంగా రూపొందించిన టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement