అనుష్క విషయంలో ఇదీ వదంతేనా? 

Mega Gossips ON Anushka Shetty Marriage - Sakshi

సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఏది నిజమో? ఏది వదంతో తెలియడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదేని నటుడు, నటి గురించి ఒక విషయం గురించి ప్రచారం జరిగితే దాన్ని ముందు వారు ఖండించినా, ఆ తరువాత అదే నిజం అవుతోంది. అయితే కొన్ని అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయి. దీంతో ఏ వార్త నిజమో, ఏది వదంతో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు నటి అనుష్క గురించిన జరుగుతున్న ప్రచారంపైనా ఇదే గందరగోళం నెలకొంది. అనుష్క ప్రేమ గురించి ఇప్పటికే పలు రకాల ప్రచారం జరగింది. ఆమెతో మూడు చిత్రాల్లో నటించిన నటుడు ప్రభాస్‌తో ప్రేమ అంటూ పెద్ద ప్రచారమే జరిగింది. దాన్ని వారిద్దరూ విడివిడిగా ఖండించారు. చదవండి: నటి 'శ్రుతి' లీలలు మామూలుగా లేవుగా..!

తాము మంచి ఫ్రెండ్స్‌ అని క్లియర్‌గా స్పష్టం చేశారు. అయినా వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం చాలా కాలం సాగింది. ఆ తరువాత ఒక వ్యాపారవేత్తతో అనుష్క ప్రేమాయణం అనే ప్రచారం సాగింది. ఇక ఇటీవల ఒక క్రికెట్‌ క్రీడాకారుడి చెట్టాపట్టాలని, త్వరలో ఆయనతో పెళ్లి పీటలు ఎక్కడానికి అనుష్క రెడీ అవుతోందని వదంతి హోరెత్తింది. దీనిని అనుష్క ఖండించింది. తాజాగా మరో ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అదే ఒక సినీ దర్శకుడితో అనుష్క ప్రేమాయణం అని, ఆ దర్శకుడికి ఇంతకుముందే పెళ్లి అయ్యిందని, అయితే మొదటి భార్యకు విడాకులు ఇచ్చారని, అనుష్కను రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారని తాజా ప్రచారం.  చదవండి: పెళ్లి కబురు చెబుతారా?

కాగా ఈ ప్రచారంలో అయినా నిజం ఉందా లేక ఇదీ యథాతథంగా వదంతేనా? అన్న సందేహం కలుగుతోంది. మరి సినీ దర్శకుడితో ప్రేమాయణం అన్న ప్రచారం గురించి నటి అనుష్క ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా ఈ 38 ఏళ్ల స్వీటీ పెళ్లి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే వరకూ ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఆమె ఎదుర్కోక తప్పదు. ఇకపోతే నటి అనుష్క నటించిన బహుబాషా చిత్రం సైలెన్స్‌ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీంతో ఈ అమ్మడు తదుపరి చిత్రం ఏమిటన్న ఆసక్తి నెలకొంది. లేదా తాళి కట్టు శుభవేళ అంటూ హఠాత్తుగా షాక్‌ ఇస్తారా అన్న ఉత్కంఠ సినీ జనాల్లో ఉంది.  

చదవండి: అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top