నటి 'శ్రుతి' లీలలు మామూలుగా లేవుగా..! | Tamil Acrot Sruthi Cheated Many People In The Name Of Marriage | Sakshi
Sakshi News home page

నటి 'శ్రుతి' లీలలు మామూలుగా లేవుగా..!

Published Sun, Mar 1 2020 6:35 AM | Last Updated on Sun, Mar 1 2020 1:05 PM

Tamil Acrot Sruthi Cheated Many People In The Name Of Marriage - Sakshi

సాక్షి, పెరంబూరు: వివాహం పేరుతో పలువురిని మోసం చేసి లక్షలు గడించిన నటి ప్రేమ గారడీ బట్టబయలయ్యింది. వివరాలు.. స్థానికి మైలాపూర్‌కు చెందిన నటి శ్రుతి. ఈమె ఆడి పోనా ఆవడి అనే తమిళ సినిమాలో నటించింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో అవకాశాల్లేక మళ్లీ చదువుకోవడానికి లండన్‌కు వెళ్లింది. ఆమె తల్లిదండ్రులు శ్రుతికి పెళ్లి చేయ తలపెట్టి వరుడి కోసం వేట ప్రారంభించారు. అందుకోసం వారు మ్యాట్రిమనిలో పేరు నమోదు చేశారు. అది చూసిన జర్మనీ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కోవైకు చెందిన బాలమురుగన్‌ నటి శ్రుతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.

ఇద్దరూ పరిచయం చేసుకున్నారు. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత నటి శ్రుతి తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని, వైద్య ఖర్చులకు డబ్బు అవసరం అయ్యిందని చెప్పడంతో ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని బాలమురుగన్‌ రూ.45 లక్షలను నటి శ్రుతికి ఇచ్చాడు. ఆ తరువాత ఆమె బాలమురుగన్‌కు దూరం అవ్వడం మొదలెట్టింది. ఆమె మోసాన్ని గ్రహించిన బాలమురుగన్‌ తల్లిదండ్రులు కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో నటి శ్రుతి పెళ్లి పేరుతో చాలా మందిని మోసం చేసి, లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తోందన్న విషయం వెలుగు చూసింది. నటి శ్రుతిని, ఆమె తల్లి చిత్రను, సహోదరుడు సుభాష్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. తరువాత బెయిల్‌లో బయటకు వచ్చిన నటి చదువు కోవడానికి లండన్‌ వెళ్లింది. చదవండి: అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క

మోసానికి గురైన మరో యువకుడు 
కాగా నటి శ్రుతి మోసానికి  చెన్నై, ముగప్పేర్‌కు చెందిన అముదన్‌ బలయ్యాడు. ఇతనిపై నటి తల్లి చిత్ర రెండు రోజుల క్రితం స్థానికి మైలాపూర్‌లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నటి శ్రుతీ లండన్‌లో చదువు కుంటోందని, ఆమె తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయాలంటూ చెన్నై, ముగప్పేర్‌కు చెందిన వ్యాపారస్తుడు అముదన్‌ వెంకటేశన్‌ పరిచయం అయ్యాడని చెప్పారు. శ్రుతిని, అముదన్‌ పెళ్లి చేసుకోవడానికి ఇష్ట పడడంతో వివాహం చేయడానికి నిర్ణయించుకున్నారన్నారు. ఆ తరువాత నటి చదువు కోసం లండన్‌కు వెళ్లిందన్నారు. అముదన్‌ నటి శ్రుతిలో వాట్సాప్‌ ద్వారా, స్కైప్‌ వీడియో ద్వారా తరచూ మాట్లాడుకునేవారన్నారు. అముదన్‌ తండ్రి రాజగోపాలన్‌ కూడా నటితో మాట్లాడారన్నారు. చదవండి: ఓవర్‌నైట్‌లో డెలివరీ బాయ్‌ కాస్త సెలబ్రిటీ

ఆ తరువాత అముదన్‌ ప్రవర్తన నచ్చని శ్రుతి అతనికి దూరం కావడం మొదలెట్టిందన్నారు. అముదన్‌ను పెళ్లి చేసుకోవడానికి శ్రుతి నిరాకరించినట్లు సమాచారం. అముదన్‌ తనను పెళ్లి చేసుకో.. లేదా కత్తితో మెడ కోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను  అంటూ బెదిరిస్తూ తీసిన వీడియోను నటికి పంపారని తెలిసింది. చెన్నైకి రాగానే నీపై యాసీడ్‌ పోస్తానని బెదిరించినట్లు తెలిసిందన్నారు. ఇందుకు అతని తండ్రి రాజగోపాల్‌ కూడా మద్దతుగా నిలిచినట్లు సమాచారం. భయపడ్డ నటి విషయాన్ని తన తల్లి చిత్రకు చెప్పడంతో ఆమె తమకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. కేసు నమోదు చేసి విచారణ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా అముదన్‌ నటి తనకు కాబోయో భార్య అని పలు లక్షలు ఆమెకు ఖర్చు చేసినట్లు తెలిసిందన్నారు. హత్యా బెదిరింపుల కింద అముదన్‌ను, ఆయన తండ్రిని  రాజగాపాల్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తరువాత వారు సొంత పూచీ కత్తుపై విడుదలయ్యినట్లు పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement