పెళ్లి కబురు చెబుతారా? | Anushka dating with a cricketer | Sakshi
Sakshi News home page

పెళ్లి కబురు చెబుతారా?

Feb 13 2020 12:21 AM | Updated on Feb 13 2020 4:27 AM

Anushka dating with a cricketer - Sakshi

అనుష్క

‘అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమెకు అరుంధతి నక్షత్రం చూపే వరుడు దొరికేశాడు. త్వరలోనే పెళ్లి  కబురు చెబుతారు’ అంటూ ఎప్పటికప్పుడు వార్తలు హల్‌చల్‌ చేస్తూనే ఉంటాయి. తాజాగా మరోసారి అనుష్క పెళ్లి వార్తలకు సంబంధించిన చర్చ మొదలయింది. ‘ప్రస్తుతం అనుష్క ఓ క్రికెటర్‌తో డేటింగ్‌ చేస్తున్నారని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు’ అనే వార్త సోషల్‌ మీడియాలో తిరుగుతోంది. అనుష్క పెళ్లి చేసుకోబోయే క్రికెటర్‌ నార్త్‌ ఇండియాకు చెందినవారని, ప్రస్తుతం సౌత్‌లో రంజీ మ్యాచ్‌ లు ఆడుతున్నారని ఆ వార్తల సారాంశం. మరి ఈ వార్తను అనుష్క నిజం చేస్తారా? వేచి చూడాలి. గతంలో అనుష్క, ప్రభాస్‌ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కూడా చాలా రోజులు తిరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ ఏప్రిల్‌ 2న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement