'మా' ఎన్నికలు ప్రారంభం | maa elections started | Sakshi
Sakshi News home page

'మా' ఎన్నికలు ప్రారంభం

Mar 29 2015 8:41 AM | Updated on Aug 9 2018 6:44 PM

'మా' ఎన్నికలు ప్రారంభం - Sakshi

'మా' ఎన్నికలు ప్రారంభం

హైదరాబాద్ : టాలీవుడ్ చిత్రపరిశ్రమలోని మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు ఎప్పుడు లేని విధంగా ఈసారి సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ఇవి మొదలయ్యాయి.

హైదరాబాద్ : టాలీవుడ్ చిత్రపరిశ్రమలోని మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు ఎప్పుడు లేని విధంగా ఈసారి సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ఇవి మొదలయ్యాయి.  అధ్యక్ష స్థానానికి ఈ ఎన్నికల్లో ప్రధానంగా గతంలో ఎమ్మల్యేగా పనిచేసిన నటి జయసుధ, ప్రముఖ సినీనటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల వ్యవహారం కోర్టు వరకు కూడా వెళ్లడంతో ప్రస్తుతం ఇందులో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సుమారు 750 మంది 'మా' లో సభ్యులుగా ఉన్నారు.  అయితే,  తెలుగు సినిమా పరిశ్రమలు ఒకరికొకరికి పడదని, వ్యక్తిగత అజెండాలు ఉన్నాయని ప్రస్తుత ఎన్నికల సమయంలో బయటపడింది.

ఇప్పటివరకు 'మా'కు అధ్యక్షుడుగా నటుడు మురళీ మోహన్ పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా మారడంతో బయట ఉండి కూడా తన ప్రభావాన్ని చూపించాలన్న ఉద్దేశంతో, మా తన గుప్పింట్లోంచి జారీపోకుండా ఉండాలన్నఆలోచనతోనే ఆయన బలంగా జయసుధకే మద్ధతిచ్చి కావాలని రాజేంద్ర ప్రసాద్ను ఒంటరి చేశారని వదంతులు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ పరిస్థితులకు దారి తీస్తాయోనని కొంత ఆందోళనగా కనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే చిత్రపరిశ్రమ నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిపోయాయని పలువురు చెప్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement