'మా ఉన్నది ఒక్కటే.. అవేవీ నమ్మొద్దు..' | MAA Warns To Illeagal Money Collections With Maa Name | Sakshi
Sakshi News home page

MAA: 'మా ఉన్నది ఒక్కటే.. అలా చేస్తే కఠిన చర్యలు..'

May 6 2026 4:28 PM | Updated on May 6 2026 4:29 PM

MAA Warns To Illeagal Money Collections With Maa Name

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ పేరుతో జరుగుతున్న మోసాలపై మా స్పందించింది. తమ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని మాకు తెలిసింది. ఇలాంటి ఎవరు కూడా నమ్మవద్దని మా సూచించింది. ఏపీ మా, మా ఏపీ పేర్లతో ఈ దందాకు తెరతీశారని వెల్లడించింది. అలాంటి అసోసియేషన్స్‌ ఏవీ లేవని.. రెండు తెలుగు రాష్ట్రాలకుల ఉన్నది కేవలం మా మాత్రమేనన పేర్కొంది.

తప్పుడు పేర్లతో కొందరు అనధికార వ్యక్తులు కళాకారులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని మా స్పష్టం చేసింది. ఇలా మోసపోయిన వారు ఎవరైనా ఉంటే మా కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కోరింది. మా పేరుతో ఎవరూ డబ్బులు వసూలు చేయడానికి అధికారం లేదని తెలిపింది. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ విషయంలో కళాకారులు అప్రమత్తంగా ఉండాలని మా విజ్ఞప్తి చేసింది. కాగా.. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు కొనసాగుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement