
మహాత్మా గాంధీజీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గాంధీ జయంతి రోజు(అక్టోబర్ 2) రాయడానికి వీల్లేని బూతుపదాలతో గాంధీజీ దూషిస్తూ సోషల్ మీడియాలో శ్రీకాంత్ అయ్యంగార్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్‌పై చర్యలు తీసుకోవాలని ‘మా’ను కోరారు. అతడి సభ్యత్వం రద్దు చేయాలని కోరుతూ...మా అధ్యక్షులు మంచు విష్ణు కు ఫిర్యాదు చేశాడు.
అనంతరం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసేలా శ్రీకాంత్ మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలతో ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి ఉంది.నిన్న సైబర్ క్రైమ్ లో శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఫిర్యాదు చేశాం. ఇప్పుడు ‘మా’ అధ్యక్షుడికి కూడా కలిశాం. ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ చెప్పింది.
పెద్ద హీరోలు కూడా శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలపై స్పందించాలి. ఆయనపై చర్యలు తీసుకోవాలి.. లేదంటే మేము యాంటీ బయోటిక్ కావల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. ‘మా’కు డిస్ప్లీనరీ కమిటీ ఉంది. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. త్వరలోనే మీటింగ్ పెట్టి..తగిన చర్యలు తీసుకుంటాం’ అని మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివ బాలాజీ అన్నారు.