మోదీపై కొరటాల శివ ఘాటు కామెంట్స్‌ | Koratala Siva Comments On Narendra Modi | Sakshi
Sakshi News home page

Mar 8 2018 11:23 AM | Updated on Aug 15 2018 2:37 PM

Koratala Siva Comments On Narendra Modi - Sakshi

తన ప్రతీ సినిమాలో ఏదో ఒక సోషల్‌ మెసేజ్‌ ఉండేలా ప్లాన్ చేసే దర్శకుడు కొరటాల శివ రాజకీయ పరిస్థితులపై కూడా తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హక్కు విషయంలో కూడా కొరటాల తన అభిప్రాయాన్ని ట్వీటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా భరత్‌ అనే నేను సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది.

ఈ టీజర్‌లో చెప్పిన ‘ఒకసారి మాట ఇచ్చి తప్పితే యుఆర్‌ నాట్‌ కాల్డ్‌ ఏ మ్యాన్‌’ అన్న పదాన్ని ప్రధాని నరేంద్రమోదీకీ అన్వయిస్తూ ‘నరేంద్ర మోదీ గారికి ఆంధ్ర ప్రదేశ్‌కు ఇచ్చిన హామీని గుర్తు చేసి ఆయన్ను మనిషిని చేయండి. సర్‌.. మీరు తెలుగు రాష్ట్రాలు భారతదేశంలోని భాగమే అని భావిస్తున్నారా..?’ అంటూ ట్వీట్ చేశాడు. మహేష్‌ హీరోగా తెరకెక్కుతున్న భరత్‌ అనే నేను వేసవి కానుకగా ఏప్రిల్‌ 20న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement