వంద కోట్ల క్లబ్‌లో కోచ్చడయాన్ | Kochadaiyaan To cross Rs 100-crores | Sakshi
Sakshi News home page

వంద కోట్ల క్లబ్‌లో కోచ్చడయాన్

May 27 2014 9:33 AM | Updated on Sep 2 2017 7:56 AM

వంద కోట్ల క్లబ్‌లో కోచ్చడయాన్

వంద కోట్ల క్లబ్‌లో కోచ్చడయాన్

సూపర్‌స్టార్ రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేసిన కోచ్చడయాన్ చిత్రం తొలివారంలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది.

చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేసిన  కోచ్చడయాన్ చిత్రం తొలివారంలోనే వంద కోట్ల క్లబ్‌లో  చేరింది.  భారతీయ సినీ చరిత్రలోనే బాలీవుడ్ చిత్రాలు అవతార్, టిన్‌టిన్ తరహాలో మోషన్ కాప్చరింగ్ టెక్నాలజీలో 3డీ ఫార్మెట్‌లో తెరకెక్కిన తొలి చిత్రంగా కోచ్చడయాన్ రికార్డు కెక్కింది. రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించారు.

 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్లు వసూలు చేసి బాక్సాఫీసును షేక్ చేసిందని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. ఒక్క భారత దేశంలోనే 30 కోట్లు వసూలు చేసిందని ఓవర్‌సీస్‌లో 12 కోట్లు కలెక్ట్ చేసిందని వెల్లడించారు. యుఏఈ, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో కోచ్చడయాన్‌కు విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement