breaking news
Collections Racing
-
రికార్డు కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం చిత్రం, 3 రోజుల్లోనే ఎంతంటే..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. సెప్టెంబర్ 16న విడుదలైన ఈ చిత్రం హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఎస్ఆర్ కల్యాణమండపం డైరెక్టర్ శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య నిర్మించారు. రిలీజైన తొలి షో నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను తెచ్చేకుంది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. చదవండి: మరో ప్రేమకథతో రాబోతున్న ‘సీతారామం’ టీం!, ఆ నిర్మాత క్లారిటీ.. మాస్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తూ కమర్షియల్ హిట్‌గా కొనసాగుతుంది. కేవలం మూడు రోజుల్లోనే 4.5 కోట్ల గ్రాస్ సాధించడం ఈ సినిమా విజయానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఏ బాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఒక హీరో సినిమా, ఈ స్థాయిలో ఆదరణ పొందడం అంటే మాములు విషయం కాదు. కిరణ్ అబ్బవరం గత చిత్రాలైన రాజా వారు రాణి గారు, ఎస్ఆర్ కల్యాణమండపంలాగే ఈ చిత్రం కూడా తెలుగు సినిమాకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చు. చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’ -
వంద కోట్ల క్లబ్లో కోచ్చడయాన్
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేసిన కోచ్చడయాన్ చిత్రం తొలివారంలోనే వంద కోట్ల క్లబ్లో చేరింది. భారతీయ సినీ చరిత్రలోనే బాలీవుడ్ చిత్రాలు అవతార్, టిన్టిన్ తరహాలో మోషన్ కాప్చరింగ్ టెక్నాలజీలో 3డీ ఫార్మెట్లో తెరకెక్కిన తొలి చిత్రంగా కోచ్చడయాన్ రికార్డు కెక్కింది. రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్లు వసూలు చేసి బాక్సాఫీసును షేక్ చేసిందని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. ఒక్క భారత దేశంలోనే 30 కోట్లు వసూలు చేసిందని ఓవర్సీస్లో 12 కోట్లు కలెక్ట్ చేసిందని వెల్లడించారు. యుఏఈ, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో కోచ్చడయాన్‌కు విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.