Kochadaiyaan
-
లతా రజనీకాంత్‌కు సంబంధం లేదు
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ సతీమణి లతారజనీకాంత్‌కు మీడియా ఒన్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ డైరెక్టర్ తిరుమూర్తి మోసెస్ తెలిపారు. బెంగళూర్‌కు చెందిన యాడ్ బ్యూరో సంస్థ మీడియా ఒన్ గ్లోబల్ సం స్థ, ఆ సంస్థలో భాగస్వామ్యం కలిగిన లతా రజ నీకాంత్ల మధ్య కేసులు, కోర్టులు అంటూ చాలా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో యాడ్‌బ్యూరో సంస్థ లతా రజనీకాంత్ పై సుప్రీంకోర్టును ఆశ్రయింంచడం, అత్యుత్తమ ధర్మాసనం ఆమె విచారణను ఎదుర్కోవలసిందేనని ఆదేశాలు జారీ చేయడం గురించి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అం దులో కొంతకాలంగా లతా రజనీకాంత్ గురించి, తమ సంస్థ గురించి మీడియా అసత్య ప్రచారాలు చేస్తోందని పేర్కొన్నారు. నిజానికి కోచ్చడైయాన్ చిత్రానికి లతారజనీకాంత్‌కు, అదే విధంగా తమ సంస్థకు, ఆమెకు ఎలాంటి సంబంధం లేదన్నా రు. కోచ్చడైయాన్ చిత్రానికి సంబంధించిన రు ణం విషయం తమ సంస్థకు యాడ్‌బ్యూరో సంస్థ కు సంబంధించిందన్నారు. ఆ సంస్థ తమకు రూ. 20 కోట్ల రుణం ఇవ్వడానికి, అందుకుగానూ చి త్రం తమిళనాడు విడుదల హక్కులను తాము ఇవ్వడానికి ఒప్పందం జరిగిందన్నారు. అయితే యాడ్‌బ్యూరో సంస్థ రూ.10 కోట్లు మాత్రమే చెల్లించిందని, మిగిలిన మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో తమ చిత్ర విడుదల 6 నెలలు ఆలస్యమైందని తెలిపారు. దీంతో తాము యాడ్‌బ్యూరో నుంచి తీసుకున్న రూ.10 కోట్లలో రూ. 9.2 కోట్లు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. అయితే యాడ్ బ్యూరో సంస్థ 2014 నవంబర్ 11న తమ సంస్థకు రాసిన లేఖలో ఒప్పందం మీరిన కారణంగా అసలు రూ.10 కోట్లతో వడ్డీ రూ. 4.30కోట్లు, మరో ఆరు నెలలు ఆలస్యం కావడంతో 80 శాతం వడ్డీ కలిపి చెల్లిం చాల్సిం దిగా పేర్కొందని తెలిపారు. -
లతా రజనీకాంత్‌కు సుప్రీం షాక్
సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కొచ్చాడయాన్ సినిమాకు సంబంధంచిన కర్నాటకలో నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేసేందుకు సుప్రీం నిరాకరించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కొచ్చాడయాన్ చిత్ర నిర్మాణం కోసం ఆ చిత్ర నిర్మాణ సంస్థ మీడియా ఒన్ గ్లోబల్ డైరెక్టర్లలో ఒకరైన లతా రజనీకాంత్ హామీ మేరకు ఆ సంస్థకు బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ రూ.10 కోట్లు అప్పుఇచ్చింది. అయితే మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ తీసుకున్న రుణంలో రూ.8.70 కోట్లనే యాడ్‌బ్యూరో సంస్థకు తిరిగి చెల్లించింది. ఇంకా మిగిలిన మొత్తాన్ని వడ్డీ సహా రూ.6.20 కోట్లు చెల్లించకపోవడంతో ఆ సంస్త సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
రజనీ కొచ్చడైయాన్ వివాదం ముగియలేదు!
తమిళసినిమా: కొచ్చడైయాన్ చిత్ర వ్యవహారం సుప్రీంకోర్టుకెళ్లడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొచ్చాడైయాన్ చిత్ర నిర్మాణం కోసం ఆ చిత్ర నిర్మాణ సంస్థ మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ డైరెక్టర్లలో ఒకరైన రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ హామీ మేరకు ఆ సంస్థకు బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ రూ.10 కోట్లు అప్పుఇచ్చింది. అయితే మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ తీసుకున్న రుణంలో రూ.8.70 కోట్లనే యాడ్‌బ్యూరో సంస్థకు తిరిగి చెల్లించింది. ఇంకా మిగిలిన మొత్తాన్ని వడ్డీ సహా రూ.6.20 కోట్లు చెల్లించకపోవడంతో ఆ సంస్త సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు యాడ్‌బ్యూరో సంస్థకు రూ.6.20 కోట్లను మీడియా ఒన్ గ్లోబల్ సంస్థగానీ, లతా రజనీకాంత్ గానీ చెల్లించాల్సిందేనని గత ఏప్రిల్‌లోనే ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు జూలై 3వ తేదీ వరకూ గడువు ఇస్తూ ఆ రోజుకు విచారణను వాయిదా వేశారు. అయితే జూలై 3న ఈ కేసు విచారణకు రాగా యాడ్ బ్యూరో సంస్థకు ఎందుకు రుణం చెల్లించలేదని సుప్రీంకోర్టు లతా రజనీకాంత్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఎప్పుడు చెల్లిస్తారో ఈ నెల 10వ తేదీలోపు కోర్టుకు తెలియజేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పత్రికలు వక్రీకరించాయి సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడ్డ కొన్ని రోజుల తరువాత ఈ వ్యవహారంపై రజనీకాంత్ రెండో కూతురు, కొచ్చడైయాన్ చిత్ర దర్శకురాలు సౌందర్య స్పందించారు.ఆమె శుక్రవారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో సుప్రీంకోర్టు ఆదేశాలను పత్రికలు వక్రీకరించాయ ని, పూర్తి సమాచారాన్ని ప్రచురించలేదని పేర్కొన్నారు. మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ గురించి, అందులో లతారజనీకాంత్ బాధ్యత ఏమిటన్నదానికంటే ఆమె తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకోకుండా, పిటిషన్‌దారుడు దాఖలు చేసిన పిటిషన్ గురించి పూర్తిగా విచారించాల్సి ఉన్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నట్లు తెలిపా రు. మీడియా ఒన్ గ్లోబల్ సంస్థలో లతారజనీకాంత్‌కు బాధ్యతలు లేవని, అందువల్ల గత ఏప్రిల్ 16న న్యాయస్థానం ఆదేశాలను అమలుపరచడం కూడదని పేర్కొందన్నారు. మీడియా ఒన్ గ్లోబల్ సంస్థలో లతా రజనీకాంత్ బాధ్యత ఎంత అన్న విషయం కంటే అసలు కేసును పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉందని అందుకు ఈ నెల 10 తేదీ వరకూ కేసు విచారణను వాయిదా వేసినట్లు సౌందర్య రజనీకాంత్ తెలిపారు. -
సూపర్‌స్టార్ భార్యకు సుప్రీం కోర్టు మందలింపు
సాక్షి, న్యూఢిల్లీ : కొచ్చాడియాన్ చిత్ర నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని చెల్లించకపోగా, విచారణ ఎదుర్కోకుండా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారంటూ లతా రజనీకాంత్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసే వాళ్లంటే మాకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు తప్పకుండా కోర్టుకు హాజరుకావాల్సిందే. తప్పేమీ లేకపోతే నిర్దోషిగా తేలతారు కదా. ఇప్పుడైనా విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే మంచిది’ అంటూ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం చురకలు అంటించింది. వివరాలు.... సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో యానిమేషన్ చిత్రం ‘కొచ్చాడియాన్’ తెరకెక్కిన విషయం తెలిసిందే. 2014లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ చిత్ర నిర్మాణం కోసం లతా రజనీకాంత్‌కు చెందిన మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ... బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ నుంచి రూ.6.20 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. అయితే రుణం చెల్లించకుండా తమను ఇబ్బంది పెడుతున్నారంటూ యాడ్‌బ్యూరో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు లతా రజనీకాంత్.. జూలై 3వ తేదీ లోపు సంబంధిత సంస్థకు రుణాన్ని చెల్లించాల్సిందేనని గత ఫిబ్రవరిలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం 12 వారాల గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. కానీ ఇంతవరకు రుణం చెల్లించకపోవడంతో లతా రజనీకాంత్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా గతంలో... ఈ కేసుతో లతా రజనీకాంత్‌కు ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఆమె హామీదారుగా మాత్రమే ఉన్నారని.. యాడ్‌బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన రుణాన్ని త్వరలోనే చెల్లిస్తామని మీడియా వన్ గ్లోబల్ సంస్థ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు... జూలై 3వ తేదీలోగా లతా రజనీకాంత్ గాని, మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ గాని యాడ్ బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ఆదేశించింది. -
లతా రజనీకాంత్ రుణం చెల్లించాల్సిందే
సాక్షి సినిమా:కొచ్చాడయాన్ చిత్రం కోసం తీసుకున్న రుణాన్ని జూలై 3వతేదీ లోగా లతా రజనీకాంత్ చెల్లించాల్సిందేనని చెన్నై హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. ఈ కేసు విషయమై ఇంతకు ముందే హైకోర్టు కొచ్చాడయాన్ చిత్రం కోసం బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ నుంచి లతా రజనీకాంత్, ఆమెకు సంబంధిత మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ రుణం రూ.6.20 కోట్లలను చెల్లించాలని గత ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. అందులో ఈ కేసుకు లతారజనీకాంత్‌కు ఎలాంటి సంబంధం లేదని, కొచ్చాడయాన్ చిత్రానికి సంబంధించిన ఈ కేసులో యాడ్‌బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన రూ.10 కోట్లలో ఇప్పటికే రూ.9.20కోట్లు తిరిగి చెల్లించినట్లు, మిగిలిన రూ.80 లక్షలను త్వరలోనే చెల్లిస్తామని పేర్కొన్నారు. పిటిషన్ కొట్టివేత.. పిటిషన్‌ను సోమవారం విచారణకు రాగా హైకోర్టు మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ పిటిషన్‌ను కొట్టివేసింది. గతంలో ఆదేశించినట్లుగా జూలై నెల 3లోగా లతారజనీకాంత్ గాని, మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ గాని యాడ్ బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. -
రజనీ భార్యకు షాక్
రజనీకాంత్ హీరోగా రూపొందిన యానిమేషన్ మూవీ ‘కొచ్చాడయాన్’ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల కోసం నిర్మాణ సంస్థ మీడియా వన్‌కు యాడ్ బ్యూరో కంపెనీ పది కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఆ సమయంలో రజనీ భార్య లతా రజనీకాంత్ హామీ సంతకం చేశారు. ఈ రుణానికి సంబంధించి కొంత మొత్తాన్ని వెంటనే చెల్లించిన చిత్ర యూనిట్ మిగతా మొత్తాన్ని ఇంతవరకు చెల్లించలేదు. ఎప్పుడు చెల్లిస్తారన్న విషయంపై కొచ్చాడయాన్ టీం నుంచి స్పందన రాకపోవటంతో యాడ్ బ్యూరో కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదంపై విచారణ జరిపిన ధర్మాసనం షూరిటీగా ఉన్న లతా రజనీకాంత్‌ను పన్నెండు వారాల్లోగా 6.2 కోట్ల రూపాయలను వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన యానిమేషన్ మూవీ కొచ్చాడయాన్లో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే, సీనియర్ హీరోయిన్ శోభనలు హీరోయిన్లుగా కనిపించారు. -
50 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రజనీకాంత్
రజనీకాంత్ కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన 'కొచ్చడయాన్' అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది. రజనీ కూమార్తె సౌంధర్య రజనీకాంత్ దర్శకత్వం చేసిన ఈ యానిమేషన్ చిత్రం కర్ణాటకలోనూ విడుదల కానుంది. ఇప్పటికే తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మరాఠి, భోజ్‌పురి, బెంగాలీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా తాజాగా కన్నడంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. దాదాపు 50 ఏళ్లుగా కన్నడ చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ సినిమాలపై నిషేధం ఉండగా ఇటీవలే ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో 50 ఏళ్ల తరువాత కన్నడంలో రిలీజ్ అవుతున్న తొలి డబ్బింగ్ సినిమాగా కొచ్చడయాన్ రికార్డ్ సృష్టించనుంది . యాబై ఏళ్ల క్రితం 1965లో తెలుగు సూపర్ హిట్ సినిమా మాయబజార్ కన్నడంలో అనువాదమైంది. ఆ తరువాత ఇన్నేళ్లకు కొచ్చడయాన్ డబ్ కావడంపై రజనీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కోచ్చడయూన్కు ప్రశంసల జల్లు
మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డి ఫార్మెట్‌తో తెరకెక్కిన తొలి భారతీయ సినిమా కోచ్చడయాన్. నలుపు, తెలుపు చిత్రాల నుంచి ఈస్ట్‌మన్ కలర్, 70 ఎంఎం, స్టీరియో సోనిక్ చిత్రాల వరకు నటించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీ 3డీ చిత్రంలో నటించిన తొలి భారతీయ నటుడుగా ఖ్యాతిగాంచారు. ఆయన రెండో కుమార్తె సౌందర్య తొలి ప్రయత్నంలోనే అద్భుత సాంకేతిక విలువలతో తెరకెక్కించి సఫలబయ్యారు. అలాంటి కోచ్చడయాన్ చిత్రం అంతర్జాతీయ సినీ ప్రముఖులను సైతం అలరించింది. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో నవంబర్ 21న కళా అకాడమీలో గల ప్రదర్శన హాలులో కోచ్చడయాన్ ప్రదర్శితమైంది. 950 మంది సినీ ప్రియులతోపాటు పలు దేశాల సినీ దిగ్గజాలు తిలకించి కోచ్చడయాన్పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇంతటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రాన్ని తెరకెక్కించిన తొలి మహిళా దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లతా రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌లను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. -
సినిమా పోయినా.. పార్టీ చేసుకున్నారు!!
-
శింబుపై సరదాగానే కామెంట్ చేశా
శింబుపై సరదాగానే కామెంట్ చేశానని దర్శకురాలు, సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ఉంటుందని నటుడు శింబు పేర్కొనడంతో వీరి మధ్య జరుగుతున్న గొడవ సమసిపోయింది. ఇంతకీ వీరి మధ్య గొడవేమిటన్నదేగా మీ ప్రశ్న. శింబు, సౌందర్య రజనీకాంత్ బాల్య స్నేహితులు. వీరిద్దరూ ఇటీవల ఒకరిపై ఒకరు ఇంటర్నెట్లో కామెంట్స్ గుప్పించుకున్నారు. ముఖ్యంగా కోచ్చడయాన్ చిత్రం చూసిన శింబు ఇంటర్నెట్లో పేర్కొంటూ చిత్రం బాగుంది దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌కు అభినందనలు అని అన్నారు. చిత్రంలోని గ్రాఫిక్స్ సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలకు దీటుగా లేకపోయినా ఆమె ప్రయత్నం భేష్ అని పేర్కొన్నారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపిన సౌందర్య రజనీకాంత్ ఇంటర్నెట్లో పేర్కొంటూ, తాను ఒక పత్రికా విలేకరినయితే శింబు ఇకపై పాడటాన్ని నిలిపి వేయాలని చెబుతానన్నారు. దీనికి శింబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌పై తిట్లపురాణంతో దండెత్తారు. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న శింబు పరిస్థితి చెయ్యిదాటుతోందని భావించి రంగంలోకి దిగారు. విమర్శించే హక్కు, భావ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆమె తన స్నేహితురాలేనని విజ్ఞప్తి చేశారు. ఇటు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ కూడా శింబు తనకు చిన్ననాటి స్నేహితుడని అందుకే సరదాగా కామెంట్ చేశానని, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. దీంతో వీరి మధ్య గొడవకు తెరపడింది. -
అనువాదం హక్కులు 30 కోట్లు?
రజనీకాంత్. ఈ పేరే ఒక ప్రభంజనం. ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ ఏ ముహూర్తంలో శివాజీ రావుకు రజనీకాంత్ అని నామకరణం చేశారో గానీ అప్పటి నుంచే ఈ సంచలన నటుడిని అదృష్ట దేవత వరించింది. నేటికీ రజనీకాంత్ అదృష్ట దేవతకు అత్యంత ప్రీతిపాత్రుడిగానే ఉండిపోయారు. వయసును చూస్తే ఆరు పదులకు పైనే నటుడుగా మూడు పదులకు పైనే అనుభవం. అయితే ఈ సూపర్ స్టార్ తన అభిమానులకు నేటికీ పాతికేళ్ల నటుడే. అందుకే అయ్యారాయన ఇండియన్ సూపర్ స్టార్. రజనీకాంత్ చిత్రం ప్రారంభం అయిందంటే ఇటు వ్యాపార వర్గాల్లోనూ అటు అభిమానుల్లోనూ అది కలిగించే సంచలనం అంతా ఇంతా కాదు. నేటికీ జయాపజాయలకతీతంగా ఈస్టార్ చిత్రాల వ్యాపారం జరుగుతుందనడానికి లింగా చిత్రానికి పెరుగుతున్న క్రేజీ నిదర్శనం. ఒక పక్క ఇటీవల తెరపైకి వచ్చిన 3డి యానిమేషన్ చిత్రం కోచ్చడయాన్‌కు మిశ్రమ స్పందన వచ్చినా తాజా చిత్రం లింగా పై అది ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం రజనీ స్టారిజంకు నిదర్శనం. లింగా చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. అయినా ఆ చిత్రం వ్యాపార వ్యవహారం జోరందుకుంది. ఈ చిత్రానికి ఒక్క తెలుగు అనువాదపు హక్కులే 30 కోట్లు పలకడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రజనీ నటించిన ఎందిరన్ చిత్రం టాలీవుడ్లో 27 కోట్లకు అమ్ముడుపోగా తాజా చిత్రం 30 కోట్లకు ఆఫర్ రావడం ఇప్పటికే ఎవరెస్ట్ శిఖరంపై కూర్చున్న రజనీ పవర్‌ను మరింత పెంచుతోందనడానికి నిదర్శనం. ఈ చిత్రం ముందు ముందు ఇలాంటి సంచలన రికార్డులను ఎన్నింటిని బద్దలుకొట్టనుందో. ముత్తు, పడయప్ప చిత్రాల తరువాత రజనీకాంత్, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కలయికలో వస్తున్న ఈ చిత్రంలో అందాల భామ అనుష్క, ముంబాయి బ్యూటీ సోనాక్షి సిన్హాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
మళ్ళీ సీక్వెల్ కూడానా?
రజనీకాంత్ నటించిన ‘కోచ్చడయాన్’కు సీక్వెల్ వస్తోందా? ఆ చిత్రం సహ నిర్మాత మురళీ మనోహర్ మాటలు వింటే అలాగే అనుకోవాల్సి వస్తోంది. త్రీడీ మోషన్ క్యాప్చర్ విధానంలో రూపొందిన ఈ చిత్ర సీక్వెల్‌కు తమ బృందం మరింత కష్టపడుతుందని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ఉత్తర భారతదేశంలో ఆశించిన రీతిలో ‘కోచ్చడయాన్’కు ఆదరణ లభించలేదని అంగీకరించిన ఆయన, ఈ వ్యాఖ్య చేశారు. ‘‘పరిమిత సమయంలో, పరిమిత బడ్జెట్లో మేము చేయగలిగినదంతా చేశాం. అయితే, ఇంకా మెరుగ్గా తీసి ఉండాల్సిందని ఒప్పుకుంటున్నా. ఏమైనా, దీనికి సీక్వెల్లో మరింత కష్టపడి, బాగా తీస్తాం’’ అని మురళీ మనోహర్ అన్నారు. హిందీ ప్రాంత ప్రేక్షకులు ఈ సాంకేతిక అద్భుతాన్ని ఆస్వాదించలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్రం ఏమిటంటే, తమిళ, తెలుగు భాషల్లో కూడా ఈ సినిమా అంతంత మాత్రంగానే ఉన్నా, ఈ సహ నిర్మాత మాత్రం ఘన విజయం సాధించిందంటూ డబ్బా కొట్టుకున్నారు. అనుకున్న దాని కన్నా ఆలస్యమైనా, హిందీలో కూడా ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందంటూ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కబుర్లు విని, సినీ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అవును మరి... మొదటి సినిమాకే దిక్కు లేదంటూ ఉంటే, దీనికి సీక్వెల్ కూడానా అని పెదవి విరుస్తున్నారు. -
వంద కోట్ల క్లబ్లో కోచ్చడయాన్
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేసిన కోచ్చడయాన్ చిత్రం తొలివారంలోనే వంద కోట్ల క్లబ్లో చేరింది. భారతీయ సినీ చరిత్రలోనే బాలీవుడ్ చిత్రాలు అవతార్, టిన్టిన్ తరహాలో మోషన్ కాప్చరింగ్ టెక్నాలజీలో 3డీ ఫార్మెట్లో తెరకెక్కిన తొలి చిత్రంగా కోచ్చడయాన్ రికార్డు కెక్కింది. రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్లు వసూలు చేసి బాక్సాఫీసును షేక్ చేసిందని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. ఒక్క భారత దేశంలోనే 30 కోట్లు వసూలు చేసిందని ఓవర్సీస్లో 12 కోట్లు కలెక్ట్ చేసిందని వెల్లడించారు. యుఏఈ, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో కోచ్చడయాన్‌కు విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. -
కూతురుని పొగిడేస్తున్న రజనీకాంత్
-
ఉన్నంతలో అదే ఊరట!
దాదాపు మూడేళ్ళకు పైగా వార్తల్లో నిలిచి, ఇటీవలే విడుదలైన రజనీకాంత్ తాజా చిత్రం ‘కోచ్చడయాన్’ (తెలుగులో ‘విక్రమ సింహ’గా విడుదలైంది) ఇప్పటికీ అదే ధోరణిని కొనసాగిస్తోంది. కాకపోతే, ఇప్పుడీ సినిమాపై సానుకూల వార్తల కన్నా ప్రతికూల వార్తలదే పైచేయి అయింది. మోషన్ క్యాప్చర్ ఫొటో రియలిస్టిక్ టెక్నాలజీలో తీసిన ఈ ఆధునిక సాంకేతిక ప్రయత్నం ఆశించిన స్థాయిలో ఎవరినీ ఆకట్టుకోలేకపోయిందని సినీ వాణిజ్య వర్గాలు తేల్చేస్తున్నాయి. తెలుగులోనే కాక, అడ్వాన్స్ బుకింగ్ జోరు తగ్గాక తమిళంలోనూ అంతంత మాత్రపు ఆదరణకే పరిమితమైంది. ‘అవతార్’ లాంటి చిత్రాల స్థాయికి చేరలేక, ‘ఏదో యానిమేషన్ సినిమా చూసినట్లుంద’న్న పెదవి విరుపులకు గురైంది. అయితే, రజనీకాంత్ సినిమా కావడం, అందులోనూ తండ్రి నటించిన సినిమాకు కుమార్తె దర్శకత్వం వహించడమన్నది ఇదే తొలిసారి కావడం, ఆధునిక టెక్నాలజీ వాడడం లాంటివన్నీ ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకొనేలా చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, ఆధునిక టెక్నాలజీ వాడకంలో తమిళనాట ముందుండే నట - దర్శకుడు కమలహాసన్ ఆదివారం నాడు ‘కోచ్చడయాన్’ చిత్రాన్ని ప్రత్యేకంగా చూశారు. రజనీకాంత్ కుమార్తె, చిత్ర దర్శకురాలు సౌందర్యా రజనీకాంత్ అశ్విన్ వ్యక్తిగతంగా ఆహ్వానించి మరీ, కమల్ కోసం ప్రైవేటుగా ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇటీవలే కాన్స్ చిత్రోత్సవానికి వెళ్ళొచ్చి, ప్రస్తుతం తమిళ చిత్రం ‘ఉత్తమ విలన్’ షూటింగ్లో తీరిక లేకుండా ఉన్న కమల్‌హాసన్, ‘విశ్వరూపం’లో తన సరసన నటించిన పూజా కుమార్‌తో కలసి ‘కోచ్చడయాన్’ చూశారు. గతంలో పలు చిత్రాల్లో రజనీకాంత్‌తో కలసి నటించి, ఆనక తెరపై రజనీకి దీటుగా నిలిచిన కమల్ ఈ సినిమాను ఆస్వాదించడమే కాక, తొలి చిత్రంలోనే ఈ స్థాయి ప్రయోగం చేసినందుకు సౌందర్యను అభినందించినట్లు అభిజ్ఞవర్గాల కథనం. మొత్తానికి, సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోందన్నది పక్కనపెడితే, తన తండ్రికి సమకాలికుడైన సినీ దిగ్గజం నుంచి ఆ మాత్రం అభినందనలు రావడం సౌందర్యకు కాస్తంత ఊరటే! కానీ, కోట్లు వెచ్చించి సినిమా ప్రదర్శన హక్కుల్ని కొనుగోలు చేసినవారి ఊరట మాటేమిటి చెప్మా! -
రజనీసింహ
-
కోచ్చడయాన్‌కు వినోదపు పన్ను రద్దు
కోచ్చడయాన్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వినోదపు పన్ను వసూలు చేయరాదని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి వినోదపు పన్నును రద్దు చేయాలని కోరుతూ చెన్నై ఎన్నూర్‌కు చెందిన ముత్తయ్య అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళంలో పేరు పెట్టిన చిత్రాలకు వినోదపు పన్ను రద్దు చేస్తూ 2007లో రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. ఆ తర్వాత ఈ విధానంలో కొన్ని సవరణలు చేస్తూ 2011లో మరోసారి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొ న్నారు. ఈ కేసును విచారించిన హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన మధ్యంతర జీవోపై తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ ప్రధానాధికారి 2014 ఏప్రిల్ 16న తెనాలి రామన్ చిత్రానికి వినోదపు పన్ను వసూలు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారని పేర్కొన్నారు. అదే విధంగా కోచ్చడయాన్ చిత్రానికి ఇదే విధానాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించారని వివరించారు. 2011లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించిందని, అలాంటిది కోచ్చడయాన్‌కు వినోదపు పన్ను విధించడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని తెలిపారు. అలాగే కోర్టును అవమానించే చర్య అవుతుందని పేర్కొన్నారు. అందువల్ల కోచ్చడయాన్ చిత్రానికి వినోదపు పన్ను రద్దు చేయాలని న్యాయవాది ముత్తయ్య పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసును న్యాయమూర్తులు ఎంఎం సుందరేశ్, ఆర్.మహదేవన్‌తో కూడిన బెంచ్ విచారించింది. కోర్టు స్టే విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కాదని వినోదపు పన్ను మినహాయిం పు చిత్రాలకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి పన్ను వసూలు చేయరాదని ఆదేశించారు. అదే విధంగా సగటు ప్రేక్షకుడి నుంచి థియేటర్ల యజమాన్యం చిత్ర వినియోగదారుల వినోదపు పన్నును వసూలు చేయరాదని పేర్కొన్నారు. ఈ కేసులో థియేటర్ల యాజ మాన్యాన్ని ప్రతివాదులుగా చేర్చి పిటిషన్ దాఖలు చేయడానికి పిటిషనర్‌కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసును ప్రత్యేక కేసుతో పాటు విచారించనున్నట్టు న్యాయమూర్తులు వెల్లడించారు. -
నేటి నుంచి కోచ్చడయాన్ టికెట్ రిజర్వేషన్
కోచ్చడయాన్ చిత్ర టికెట్ రిజర్వేషన్ బుకింగ్ కోలాహలం మొదలు కానుంది. సూపర్‌స్టార్ రజనీ కాంత్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం కోచ్చడయాన్. ఈ చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ నెల 23కు విడుదల వాయిదా పడింది. ఆరు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా కోచ్చడయాన్ ఆరువేల థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఒక్క తమిళనాడులోనే 450 థియేటర్లలో ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆరువేలకు పైగా థియేటర్లలో చిత్రం విడుదలకానుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. కోచ్చడయాన్ చిత్రం ఈ నెల 9న విడుదల కానున్నట్లు గతంలో ప్రకటించారు. అప్పుడు చెన్నైలో కేవలం రెండు గంటల వ్యవధిలోనే లక్షా 25 వేల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. ఆ తరువాత చిత్రం వాయిదా పడడంతో మళ్లీ ఆదివారం నుంచి అడ్వాన్స్ బుకింగ్ మొదలు కానుంది. -
రజనీ చిత్రం ప్రారంభోత్సవం
రజనీకాంత్ నటిస్తున్న లింగా చిత్రం పూజా కార్యక్రమం మైసూరు చాంముండేశ్వరి ఆలయంలో శుక్రవారం జరిగింది. రజనీ యానిమేషన్ చిత్రం అయిన కోచ్చడయాన్ ఈ నెల తొమ్మిదో తేదీ విడుదల కానుంది. ఆరు భాషల్లో ఈ చిత్రం విడుదల చేస్తున్నారు. మరో చిత్రంలో కొత్త గెటప్‌లో రజనీ నటిస్తున్నారు. ఈ చిత్రానికి లింగా అనే పేరును పెట్టారు. రజనీ పరమ శివ భక్తుడు. ఇది వరకే అన్నామలై, అరుణాచలం అనే శివుని పేర్లతో తీసిన చిత్రాల్లో నటించారు. ఇవన్నీ విజయం సాధించారుు. ప్రస్తుతం కొత్త చిత్రానికి లింగా అనే పేరును సూచించడం ఆయనకు ఆనందాన్నిచ్చింది. ఈ చిత్రం షూటింగ్ మైసూర్లో 45 రోజుల పాటు జరగనుంది. ఇందు కోసం అక్కడ సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం రజనీ, లింగా చిత్ర దర్శకుడు కె.ఎస్.రవికుమార్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మైసూర్లో గల చాముండేశ్వరి ఆలయానికి వెళ్లారు. రజనీ ఈ చిత్రం కోసం ప్రత్యేక గెటప్‌లో అక్కడికి చేరుకున్నారు. రజనీ స్నేహితుడైన కన్నడ నటుడు అంబరీశ్, ఆయన సతీమణి నటి సుమలత అక్కడికి వచ్చారు. చాముండేశ్వరి అమ్మవారి ముందు క్లిప్పింగ్ బోర్డు, స్క్రీన్ ప్లే పుస్తకాన్ని ఉంచి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రజనీకి డెరైక్టర్ కె.ఎస్.రవికుమార్‌కు అంబరీశ్ పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో అక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ చిత్రంలో రజనీ కాంత్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలిసింది. లింగా చిత్రంలో హీరోయిన్లుగా అనుష్క, సోనాక్షి సిన్హాలు ఎంపికైన విషయం తెలిసిందే. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్.రత్నవేలు చాయాగ్రహణం అందిస్తున్నారు. -
మోడీకి రజనీ స్పెషల్ షో!
రజనీకాంత్ నటించిన ‘కోచ్చడయాన్’ (తెలుగులో ‘విక్రమ సింహ’) మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఇటీవల చెన్నైలో రజనీకాంత్‌ని కలిసినపుడు ‘కోచ్చడయాన్’ గురించి ప్రస్తావించారట. అందుకే గుజరాత్లో ఆయన కోసం ప్రత్యేక ప్రదర్శన వేయడానికి రజనీ సన్నాహాలు చేస్తున్నారట. -
కోచ్చడయాన్ విడుదలకు చిక్కులా?
కోచ్చడయాన్ చిత్రం విడుదలకు చిక్కులా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే. సూపర్‌స్టార్ రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం కోచ్చడయాన్. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకునే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు కె ఎస్ రవికుమార్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించారు. రజనీ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్, అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హిందీ నటుడు జాకీష్రాఫ్, శరత్‌కుమార్, ఆర్తి, నటి శోభన వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలను పోషించారు. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డీ ఫార్మెట్లో రూపొందిన తొలి భారతీయ చిత్రం కోచ్చడయాన్. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చిత్ర విడుదల ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఈసారి మాత్రం నిర్మాతలు మే నెల తొమ్మిదిన విడుదలవుతుందని స్పష్టంగా ప్రకటించారు. అయితే తాజాగా చిత్ర విడుదలకు చిక్కులేర్పడుతున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. చిత్ర నిర్మాతకు, పంపిణీదారుడికి మధ్య ఆర్థిక సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ఈ విషయమై చర్చలు వాడివేడిగా జరుగుతున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ విషయమై డిస్ట్రిబ్యూటర్స్ సంఘం కార్యదర్శి జయకుమార్ మాట్లాడుతూ భారీ చిత్రాల విడుదల సమయాల్లో థియేటర్ల టికెట్ల ధర ఎవరికెంత శాతం చెందాలన్న విషయాలపై చర్చ జరగడం సహజం అన్నారు. ఇలాంటి చర్చనే ప్రస్తుతం కోచ్చడయాన్ చిత్ర విషయంలో జరుగుతోందని పేర్కొన్నారు. సుదీర్ఘ చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. చిత్రం ప్రకటించిన విధంగానే మే నెల తొమ్మిదిన విడుదలవుతుందనే అభిప్రాయాన్ని జయకుమార్ వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారం గురించి నిర్మాతల తరపు నుంచి ఎలాంటి వివరణ వెలువడలేదు. దీంతో కోచ్చడయాన్ విడుదలపై రకరకాల ప్రచారం జరుగుతోంది. -
నాన్నను ఎప్పుడూ అలా చూడకూడదనుకున్నా..
ఇవాళ దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం - తమిళ ‘కోచ్చడయాన్‘ (తెలుగులో ‘విక్రమ సింహ’). రజనీకాంత్ నటించిన ఈ అత్యాధునిక సినిమాకు ఆయన చిన్న కుమార్తె సౌందర్య డెరైక్టర్. తండ్రి నటిస్తుంటే, కుమార్తె దర్శకత్వం వహించడం భారతీయ సినీ చరిత్రలో ఇదే తొలిసారి. మోషన్ క్యాప్చర్ ఫొటో రియలిస్టిక్ టెక్నాలజీతో తయారైన మన తొలి సినిమా కూడా ఇదే. సూపర్ స్టార్ తండ్రి... సూపర్ కూతురు... సూపర్ టెక్నాలజీ సినిమా... ఇంకేం.. 29 ఏళ్ల సౌందర్యా రజనీకాంత్‌ను కదిలిస్తే, కబుర్లకు కొదవా. నేను చెన్నైలో పుట్టి పెరిగా. మా అమ్మ నడుపుతున్న ‘ది ఆశ్రమ్’ స్కూలులో చదువుకున్నాను. అసలు చిన్నప్పటి నుంచి నాకు వాక్యాలు చదవడం కన్నా, బొమ్మలు చూడడం బాగా ఇష్టం. నేనెప్పుడూ పదాల్లో ఆలోచించను, నా ఆలోచనలెప్పుడూ బొమ్మల్లోనే! పెర్త్‌కు వెళ్ళి, గ్రాఫిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసి, వచ్చా. ఆఫర్లొచ్చినా, నటన వైపు మొగ్గలేదు. సినీ ప్రముఖుడి సంతానానికి ఎవరికైనా, సినిమా పట్ల ఆకర్షణ కలగడం సహజమే. కానీ, దాని వల్ల కొన్ని సానుకూలతలున్నాయి. ప్రతికూలతలూ ఉన్నాయి. పిల్లలైన మేము ఏం కావాలని అనుకుంటున్నదీ నాన్న గారు మాతో ఓపెన్‌గా మాట్లాడారు. మేము కెమేరా ముందుకు రావడాన్ని ఆయన పెద్దగా ఇష్టపడలేదు. నాకు కూడా యానిమేషన్ అంటే ఆసక్తి. యానిమేషన్, విజువల్ గ్రాఫిక్స్ నా ఊహలకు రెక్కలు తొడిగాయి. అలా ‘శివాజీ’, ‘రోబో’లకు పని చేశా. యువతరం కథ ‘గోవా’ నచ్చి, నిర్మాతనయ్యా. ‘కోచ్చడయాన్’తో దర్శకత్వం వైపు వచ్చా. పరిస్థితులెటు తీసుకెళితే అటెళుతున్నా. అమ్మంటే ఇష్టం నేను అమ్మ కూచిని. మా అమ్మ లాగా దేనినైనా సానుకూల దృక్పథంతో చూసే, దృఢమైన వ్యక్తిత్వమున్న మహిళ చాలా అరుదు. నాకు అన్నీ మా అమ్మే. మా ఇంటి మొత్తాన్నీ ఆమే నడుపుతుంది. బయట ఇంత పేరున్న మా నాన్న గారు కూడా నూటికి 200 పాళ్ళు అన్నిటికీ ఆమె మీద ఆధారపడుతుంటారు. ఆమె ఏకకాలంలో అనేక పాత్రలు పోషిస్తుంటారు. ఆమెకున్న సహనం అంతా ఇంతా కాదు. సూపర్‌స్టార్ కుమార్తెగా... ప్రముఖుల పిల్లలమైనప్పుడు అందరి దృష్టీ మన మీద ఉంటుంది. తల్లితండ్రుల గొప్పతనంతో, వారు సాధించిన విజయాలతో అనుక్షణం పోలుస్తూ ఉంటారు కాబట్టి, ఒత్తిడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మా గురించి రాస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ తప్పవు. అయినా, అక్కచెల్లెళ్ళమైన మా ఇద్దరి బాల్యం అద్భుతంగా గడిచింది. అప్పట్లో మా నాన్న గారు రోజూ మూడు షిఫ్టులతో తీరిక లేకుండా పనిచేస్తుండేవారు. ఆయన దగ్గర లేని లోటు లేకుండా అమ్మ చూసేది. అమ్మమ్మ వాళ్ళు మధ్యతరగతి పిల్లల్లా పెంచారు. ‘కోచ్చడయాన్’ మొదలైందిలా... ముందు అసలు నేను ‘సుల్తాన్’ అనే 3డి యానిమేషన్ చిత్రం తీయాలనుకున్నా. అనేక కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇక, ఆ సినిమా తీసే ఆలోచన లేదు. ‘సుల్తాన్’ ఆగాక,‘రాణా’ సినిమా నాన్న గారితో ప్రారంభించాం. తీరా నాన్న గారికి ఒంట్లో బాగాలేక ఆ సినిమా కూడా ఆగిపోయింది. నాన్న గారితో గతంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.ఎస్. రవికుమార్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించాల్సింది. నాన్న గారి ఆరోగ్యం బాగవడంతో, ‘రాణా’ కన్నా ముందు దానికి ముందు భాగం ఒకటి తీయాలనుకున్నాం. రాణాకు తండ్రే ఈ కోచ్చడయాన్. ‘కో’ అంటే రాజు గారనీ, ‘చడయాన్’ అంటే అంటే పొడవాటి జుట్టున్న వ్యక్తి అనీ అర్థం. శివుణ్ణి పూజించే ఓ రాజ వంశీకుల కాల్పనిక కథ ఇది. పెర్ఫార్మెన్స్ క్యాప్చరింగ్ అంటే... మన దేశంలో సాధారణంగా విజువల్ ఎఫెక్ట్లు, గ్రాఫిక్స్ లాంటివి యాక్షన్ సన్నివేశాలు, పాటల లాంటి ఏదైనా ఓ ప్రత్యేక సందర్భంలానే వాడతారు. టెక్నాలజీని మేళవించుకొని నడిచే ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘అవతార్’ లాంటి సినిమాలు ఇక్కడ తీయం. నిజానికి, మన దేశంలో అవి రూపొందించగల ప్రతిభావంతులైన టెక్నీషియన్లు చాలా మంది ఉన్నారు. అందుకే భారతదేశంలోనే తొలిసారిగా పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ పద్ధతిలో ‘కోచ్చడయాన్’ తీశా. నటీనటులు సెన్సర్లు తగిలించిన తోలుదుస్తులతో వచ్చి కెమేరా ముందు అభినయిస్తారు. వారి కదలికల్నీ, అభినయాన్నీ క్యాప్చర్ చేసి, 3డి వెర్షన్లో ప్రవేశపెట్టి, పాత్రల రూపురేఖల్ని యానిమేషన్లో తీర్చిదిద్దుతాం. మనకు ఇప్పటి దాకా తెలియని ఇలాంటి సరికొత్త పద్ధతిలో సినిమా తీయడమంటే, ఆర్థికంగా అభద్రత తలెత్తుతుంది. అయినా సరే, ఈ కొత్త దోవ తొక్కాం. కష్టపడి ‘కోచ్చడయాన్’ తీశాం. బాక్సాఫీస్ వద్ద విజయమంటారా... కష్టపడి పనిచేసి, ఫలితం దేవుడికి వదిలేయాలి. అయితే, రజనీకాంత్ అభిమానులకు నచ్చేవన్నీ సినిమాలో ఉన్నాయని చెప్పగలను. నాన్నకు దర్శకురాలిగా... అన్ని భాషల సినిమాలూ చూస్తుంటాను. తొలి సినిమాకే అంత గొప్ప నటునికి దర్శకత్వం వహించడం నా అదృష్టం. కొన్నిసార్లు నేను ‘యాక్షన్’ అని చెప్పి, షాట్ అయిపోయినా సరే ‘కట్’ చెప్పడం మర్చిపోయి, నాన్న గారి అభినయాన్ని చూస్తూ ఉండిపోయేదాన్ని. ఇక, కొన్ని సందర్భాల్లో ఆయన హీరోగా, నేను దర్శకురాలిగా కాకుండా తండ్రీ కూతుళ్ళలా ప్రవర్తించేవాళ్ళం. ఒకసారి మా అమ్మ ఏ సన్నివేశాలు తీస్తున్నారని అడిగింది. అప్పుడు మేము ‘అప్పా’ (తమిళంలో నాన్న అని అర్థం)కీ, దీపికా పదుకొనేకీ మధ్య ప్రేమ సన్నివేశాలు తీస్తున్నాం. ఆ మాటే చెప్పా. ఆ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి కానీ, వాటిని చిత్రీకరించడం దర్శకురాలిగా నాకూ, నటుడిగా నాన్నకూ కొద్దిగా ఇబ్బంది అనిపించింది. చిత్రీకరణ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. అప్పుడు నాలోని కుమార్తె తొంగి చూసేది. కెమేరా ముందు ఆయన నటన చూస్తున్నప్పుడు నాలోని అభిమాని బయటకొచ్చేది. ఏ రోజుకా రోజు ఆనాటి షెడ్యూల్ పూర్తయ్యేలా చూడాల్సి వచ్చినప్పుడు నాలోని దర్శకురాలు బహిర్గతమయ్యేది. ఆయనకు శ్రమ అనిపించకుండా, అదే సమయంలో నా లాంటి అభిమానులంతా ఆయనను ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపించేలా చూపాను. చుట్టూతా ఏమీ లేకపోయినా, అవి ఉన్నట్లు ఊహించుకొంటూ, నటించాలి కాబట్టి, ప్రతి సన్నివేశాన్నీ లోతుగా వివరించేదాన్ని. ఆయన అంత పెద్ద సూపర్‌స్టార్ అయినా కొత్త దర్శకురాలినైన నా మాట శ్రద్ధగా వినేవారు. చెప్పినట్లు చేసేవారు. ఆయన అంతెత్తుకు ఎలా ఎదిగారన్నది అప్పుడు అర్థమైంది. ఈ సినిమా తరువాతా నాన్నగారు నటిస్తూనే ఉంటారు. మేము ముందనుకున్న కె.ఎస్. రవికుమార్ స్క్రిప్టు ‘రాణా’ సిద్ధంగానే ఉంది. ఏదో ఒక రోజున ఆ కలా నిజం కావచ్చు. అక్కను మెప్పించడమా... అమ్మో... అక్కయ్య ఐశ్వర్య నాకు పూర్తిగా భిన్నమైన వ్యక్తి. నేను బహిర్ముఖురాలినైతే, ఆమె అంతర్ముఖురాలు. ఆమె వీణ నేర్చుకోవడానికి వెళితే, నేను గోల్ఫ్‌కు వెళ్ళేదాన్ని. కట్టూబొట్టుల్లో ఆమె భారతీయతననుసరిస్తుంది. నాది అందుకు భిన్నమైన పంథా. మాది ప్రత్యేకమైన అనుబంధం. పొద్దస్తమానం మాట్లాడుకోము కానీ, ముఖ్య విషయాలు చర్చించుకుంటాం. ఆమె కూడా దర్శకురాలే. నిర్మొహమాటంగా విమర్శించుకుంటూ ఉంటాం. అక్కను మెప్పించడం అంత సులభం కాదు. ఆమె ‘ఫరవా లే’దందంటే, బ్రహ్మాండంగా ఉన్నట్లు లెక్క. ‘కోచ్చడయాన్’ చూసి, ‘మంచి సినిమా’ అంది. ఎంతో ఒత్తిడికి లోనయ్యా... ఆ మధ్య మా నాన్న గారికి ఒంట్లో బాగా లేనప్పుడు ఎంతో ఒత్తిడికి లోనయ్యా. అంతకు ముందు మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదు. అది మానసికంగా కుంగదీసింది. అక్కచెల్లెళ్ళమిద్దరం అన్నీ వదిలేసి, అనుక్షణం నాన్న గారి వెంటే ఉన్నాం. ఆ రోజులు తలుచుకుంటే కూడా ఇప్పటికీ నాకు భయమేస్తుంది. నాన్న గారిని ఎప్పుడూ అలా చూడకూడదనుకున్నా. అలాంటి పరిస్థితి రాకూడదని వేయి దేవుళ్ళకు మొక్కుకున్నా. ఇక, నేను చేపట్టిన ప్రాజెక్టులేవీ ముందుకు సాగక, స్తంభించిపోయినప్పుడు నిరాశకు లోనయ్యా. అయితే, మా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. వ్యాపారవేత్త అయిన నా భర్త అశ్విన్, నా అత్తమామలు నా పనిని అర్థం చేసుకొని నైతికంగా మద్దతునిచ్చారు. తరతరాలకూ తెరపై రజనీ... ఈ భారీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు పెద్ద బరువు దింపుకున్నట్లుంది. కొద్ది రోజుల్లో ‘కోచ్చడయాన్’ రిలీజవుతుండడంతో ప్రేక్షకులెలా ఆదరిస్తారా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు టెక్నాలజీ సాయంతో రజనీకాంత్‌కు సంబంధించిన వర్చ్యువల్ ఇమేజరీలు లెక్కలేనన్ని సృష్టించాం. రాబోయే రోజుల్లో ఎవరైనా భౌతికంగా ఆయన బాడీ లాంగ్వేజ్‌ను అనుసరిస్తే చాలు, ఆ ఇమేజరీల సాయంతో, సరైన ఎఫెక్ట్‌ల ద్వారా ఎన్నేళ్ళ తరువాతైనా సరే రజనీకాంత్‌ను వెండితెరపై పునఃసృష్టించవచ్చు. తరతరాలు అభిమానులకది కన్నుల పండుగ. ఆయనలోని గొప్పదనం అదే... నాన్న గారిలో గొప్పదనం ఏమిటంటే, డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తితో ఎలా మాట్లాడతారో, అవేమీ లేని డ్రైవర్‌తోనూ అదే పద్ధతిలో మాట్లాడడం. అందుకే, తెర బయటా ఆయనే నా హీరో. ఆయన లాగే నేనూ పట్టిన పట్టు విడవను. వల్ల కాదు లెమ్మని దేనినీ అంత తొందరగా వదిలేయను. మొదట్లో ఆయన బస్ కండక్టర్. తమిళం ఒక్క ముక్క రాదు. అలాంటి వ్యక్తి పట్టుదలతో ఇవాళ ఏ స్థాయికి చేరారో చూడండి. ఆయన రక్తం పంచుకు పుట్టినందుకు గర్విస్తున్నా. -
ప్రపంచంలో ఇంత రిస్క్ ఎవరూ చేయలేదా?
కథానాయికలు చెట్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడటానికే పనికొస్తారా? అదేం కాదు.. అవకాశం ఇస్తే రౌడీల అంతు కూడా చూస్తారు. త్వరలో విడుదల కానున్న ‘కొచ్చడయాన్’లో దీపికా పదుకొనే ఆ పనే చేశారు. ఇందులో పది నిమిషాల పాటు సాగే ఓ పోరాట సన్నివేశంలో ఆమె చాలా రిస్క్ తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏ కథానాయికా చేయనంత రిస్క్‌ని దీపికా చేశారని చిత్రబృందం అంటున్నారు. హాలీవుడ్ చిత్రం ‘లారా క్రాఫ్ట్’లో ఏంజెలినా జోలీ చేసిన పోరాట దృశ్యాలకన్నా దీపికా చేసినవి కఠినమైనవట. ‘అయ్యో ఆడపిల్ల కదా...’ అని ప్రత్యేక సదుపాయాలు ఇవ్వడంగానీ, కొంచెం రిస్క్ తగ్గించడం కానీ చేయలేదు. దీపికా కూడా వెనకడుగు వేయడానికి ఇష్టపడలేదు. ఎంత క్లిష్టమైనా ఫర్వాలేదని ఆ పోరాట దృశ్యాలను చేశారు. ఫైట్స్ చిత్రీకరించే ముందు దీపికా బాగా రిహార్సల్ చేశారని, అద్భుతంగా చేసి ‘డేర్ డెవిల్’ అనిపించుకున్నారని సమాచారం. దీపికా క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయి అనే విషయం తెలిసిందే. ఆమె తండ్రి ప్రకాష్ పదుకొనే, చెల్లెలు అనీషా ఇద్దరూ క్రీడాకారులే. దీపిక కూడా బ్యాడ్మింటన్ బాగా ఆడతారు. చదువుకొనే రోజుల్లో జాతీయ స్థాయిలో ఆడారట. క్రీడాకారులకు మంచి ఫిట్నెస్ ఉంటుంది కాబట్టి, దీపిక ఈ క్లిష్టమైన ఫైట్స్ చేయగలిగారని చిత్రదర్శకురాలు సౌందర్య అంటున్నారు. తను నటించే సినిమాల్లో క్లిష్టమైన పోరాటాలు చేయాలని దీపిక ఎప్పటి నుంచో కల కంటున్నారట. ఆ కల ‘కొచ్చడయాన్’తో నెరవేరిందని, భవిష్యత్తులోనూ ఇలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని దీపిక అన్నారు. -
అమితాబ్ చేతుల మీదుగా కొచ్చడయాన్ హిందీ ట్రైలర్ లాంచ్
-
రజనీకాంత్ కోచడయాన్ మళ్లీ వాయిదా?
ముంబై: రజనీకాంత్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న కోచడయాన్ చిత్రం విడుదల తేదీ మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. మే 1న ఈ సినిమాను విడుదల చేయవచ్చని ఈ ప్రాజెక్ట్ అత్యంత సన్నిహిత వర్గాలు తెలిపాయి. తమిళ సూపర్ స్టార్ రజనీ హీరోగా, ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ సినిమాను తమిళంతో పాటు పలు భాషాల్లో రూపొందించారు. తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అభిమానులు రెండేళ్లుగా నిరీక్షిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీ సరసన దీపికా పదుకొనె కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, శరత్‌కుమార్, శోభన, ఆది తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఎ.ఆర్. రహమాన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం తెలుగులో ‘విక్రమసింహా’ పేరుతో విడుదల కానుంది. ఇంకా హిందీతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు. -
రజినీకాంత్‌కు ఫ్యాన్‌గా మారిన బాద్ షా
-
'కోచడయాన్' సినీ చరిత్రలో గొప్ప చిత్రం:రజనీకాంత్
చెన్నై: ‘కోచడయాన్’ (తెలుగులో విక్రమసింహా) సినిమా సినీ చరిత్రలో గొప్ప చిత్రంగా నిలుస్తుందని దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రజనీకాంత్ కూతురు సౌందర్య నిర్మించిన కోచడయాన్ ఆడియో ఆవిష్కరణ ఆదివారం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ తనకు రాజుల కథలంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం అని చెప్పారు. ఆ తరహా కథతో సినిమా చేయాలన్న తన కోరిక ఈ చిత్రం ద్వారా నెరవేరిందన్నారు. తన అభిమానులను ఈ సినిమా తప్పక అలరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి దక్షిణాది చిత్రసీమ తరలివచ్చింది. యానిమేటెడ్ చిత్రంగా కాప్చర్ మోషన్లో రూపుదిద్దుకోవటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన దీపికా పదుకునే నటించింది. ఈ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె దర్శకత్వం వహించటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఏఆర్ రెహమాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షారూక్ మాట్లాడుతూ తాను రజనీకాంత్‌కి వీరాభిమానినని చెప్పారు. తెరపై రజనీ స్టయిల్ చూసి మెస్మరైజ్ అయిపోయానన్నారు. ఇరవై ఏళ్ళక్రితం ఓ షూటింగ్ నిమిత్తం ఆయన ముంబై వచ్చినప్పుడు సిగరెట్ కాల్చే స్టయిల్ స్వయంగా చూశానని, ఆయనలా స్టయిల్‌గా కాల్చాలని చాలాసార్లు ప్రయత్నించి విఫలమయినట్లు చెప్పారు. రా.వన్ చిత్ర నిర్మాణ సమయంలో సౌందర్య, లతా మేడమ్, రజనీకాంత్‌లు తనకు ఎంతో సహాయం చేశారని షారుక్ పాత విషయాలను గుర్తు తెచ్చుకున్నారు. ఆడియో ఆవిష్కరణలో రజనీకాంత్, ఆయన గురువు బాలచందర్, శంకర్, ఏఆర్ రహమాన్, దీపిక పదుకొణే, రసూల్, పూకుట్టి, శరత్ కుమార్, శోభన, సౌందర్య రజనీకాంత్, దనుష్, వెరముత్తు, కేయస్ రవికుమార్, ఆది పినిశెట్టి, నాజర్, ఏవీఎం శరవణన్ తదితరులు పాల్గొన్నారు. -
కోచ్చడయాన్ మళ్లీ వాయిదా?
కోచ్చడయాన్ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడనుందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే. సూపర్ స్టార్ రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నా తాజా చిత్రం కోచ్చడయాన్. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో త్రీడీ ఫార్మెట్లో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం కోచ్చడయాన్. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో హిందీ నటుడు జాకీష్రాఫ్, శరత్ కుమార్, ఆది, శోభన తదితర ప్రముఖ తారలు నటించిన ఈ చిత్రానికి రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య అశ్విన్ దర్శకురాలు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, పంజాబి, గుజరాతి, జపనీస్, ఫ్రెంచ్ తదితర భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఆరు వేల థియేటర్లలో ఏప్రిల్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల తొమ్మిదిన చిత్ర గీతాలు, ప్రచార చిత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు చిత్ర విడుదల వ్యవహారంపైనే చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడమే. ఏప్రిల్ 24న తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ చిత్రం విడుదలకు చిక్కొచ్చిపడింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరగనుండడంతో కోచ్చడయాన్ చిత్రాన్ని విడుదల చేయడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్నికలనంతరం అంటే మే నెలకు చిత్ర విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నటుడు విశాల్ నిర్మిస్తూ నటిస్తున్న నాన్ శివప్పు మనిదన్, శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న మాన్ కరాటే చిత్రాల విడుదల వాయిదా పడనున్నాయి. మొత్తం మీద భారీ చిత్రాలు ఏప్రిల్‌లో లేనట్లేనని సమాచారం. -
అనుష్కకు జాక్‌పాట్!
సూపర్ స్టార్ రజనీకాంత్, సూపర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌ల కాంబినేషన్లో ఇంతకు ముందు ముత్తు, పనయప్ప వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతున్న కోచ్చడయాన్ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతల్ని నిర్వహించారు. సూపర్ స్టార్, కె.ఎస్.రవికుమార్‌ల కాంబినేషన్ రిపీట్ కానుందన్నది తాజా సమాచారం. కోచ్చడయాన్ చిత్ర ఆడియో ఈ నెల తొమ్మిదిన, చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానున్నాయి. దీంతో రజనీకాంత్ తదుపరి చిత్రం ఏమిటన్న విషయంపై పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. స్టార్ డెరైక్టర్ శంకర్ రజనీతో ఎందిరన్ - 2 తెరకెక్కించనున్నారని, ప్రముఖ చాయాగ్రాహకుడు, దర్శకుడు కేవీ ఆనంద్ కూడా సూపర్ స్టార్ కోసం సూపర్ కథను సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యలో రజనీ ఓకే అంటే చంద్రముఖి-2 తీయడానికి తాను రెడీ అంటూ దర్శకుడు పి.వాసు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితిలో రజనీకాంత్, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో భారీ చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. ఇంతకుముందు కె.ఎస్.రవికుమార్ వద్ద సహాయక దర్శకుడిగా పని చేసి, ఆ తర్వాత ప్రియమణి హీరోయిన్గా చారులత చిత్రానికి దర్శకత్వం వహించిన పొన్కుమరన్ రజనీ కోసం పక్కా కమర్షియల్ కాక్టైల్ కథను తయారు చేశారట. దీన్ని కె.ఎస్.రవికుమార్ రజనీకి వినిపించారట. కర్ణాటకకు చెందిన రజనీ చిరకాల మిత్రుడు రాక్‌లైన్ వెంకటేశ్ ఈ భారీ బడ్జెట్ బొనాంజా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అనుష్కకు జాక్‌పాట్ అందాలతార అనుష్క జాక్‌పాట్‌ను కొట్టేసిందనే టాక్ ప్రచారం అవుతోంది. ఇంతకు ముందు సూపర్ స్టార్‌తో నటించే రెండు చాన్సులను మిస్ అయ్యిందట. ఈసారి రజనీ, కె.ఎస్.రవికుమార్‌ల చిత్రంలో హీరోయిన్ అనుష్కనేనని సమాచారం. -
విడుదలకు ముందే భారీ అంచనాలు!
చెన్నై: దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన కొచ్చడయాన్ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. రజనీ సినిమా కోసం మూడేళ్ల ఎదురుచూపులను నిజం చేస్తూ కొచ్చాడియన్ చిత్రం ఈ ఎప్రిల్లో అభిమానుల ముందుకు రాబోతోంది. రజనీకాంత్ కూతురు సౌందర్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విజయం సాధించాలంటూ చెన్నైలో రజినీకాంత్ ఇష్ట దైవం అయిన రాఘవేంద్రస్వామిగుడిలో ఆయన అభిమానులు పూజలు నిర్వహించారు. అంతేకాదు, సినిమా పరిశ్రమలో రజనీకాంత్ సన్నిహితులు, రజనీకాంత్‌తో ఉన్న అనుబంధం గురించే చెప్పే బుక్‌ను అభిమానులు విడుదల చేశారు. రజనీకాంత్‌కు దాదాపు 20కిపై కమర్షియల్ సెక్సెస్లు అందించిన దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ ఈ బుక్‌ను విడుదల చేశారు. -
కొచ్చాడయాన్ ప్రమోషన్లో దీపికా
-
అవినీతిపై రజనీ పోరాటం
రజనీకాంత్ సినిమా వచ్చి మూడేళ్లు దాటిపోయింది. తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఆయన నటించిన ‘కొచ్చాడయాన్’ సినిమా కోసం ప్రస్తుతం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని సమాచారం. తెలుగులో ఈ సినిమా ‘విక్రమసింహా’ పేరుతో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే... మూడేళ్ల క్రితం వచ్చిన ‘రోబో’ కానీ, రానున్న ‘విక్రమసింహా’ కానీ... సాంకేతికంగా మాత్రమే ఉన్నతమైన సినిమాలు. కథా వస్తువు పరంగా సమాజానికి అవి ఆమడదూరం. రజనీలోని మాస్ యాంగిల్‌ని ఆవిష్కరింపజేసే సినిమాలు అవి కానేకావు. ఓ విధంగా ‘శివాజీ’ తర్వాత మాస్ మెచ్చే పాత్ర రజనీ చేయలేదు. ఆ లోటును భర్తీ చేయడానికే దర్శకుడు శంకర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. జనం కోసం పోరాడే నిజమైన నాయకుడిగా రజనీని చూపించబోతున్నారాయన. ఈ లైన్ రజనీకాంత్‌కి కూడా విపరీతంగా నచ్చేసిందట. ప్రస్తుతం ‘ఐ’ చిత్రం షూటింగ్లో ఉన్న శంకర్... మరోవైపు రజనీకాంత్ కోసం అనుకున్న లైన్‌ని కథగా మార్చే పనిలో ఉన్నారు. ‘శివాజీ’లో విద్యావ్యవస్థ తీరుపై రజనీ పోరాటం చేస్తే... ప్రస్తుతం తయారవుతున్న కథలో అవినీతి, లంచగొండితనాన్ని టార్గెట్ చేస్తారట. రకరకాల సామాజిక అంశాలను ప్రస్తావించేలా ఈ కథాంశం ఉంటుందని సమాచారం. ఓ సామాన్యుడు తలచుకుంటే ఏం జరుగుతుందో తెలియజెప్పేలా ఈ కథాంశం ఉంటుందట. శివాజీ, రోబో చిత్రాలతో అద్భుతాలు సృష్టించిన ఈ కాంబినేషన్ ఈ కథ ద్వారా రేపు ఇంకెన్ని సంచలనాలు సృష్టించనుందో వేచిచూడాలి. -
దక్షిణాది ఫోకస్... ఈ ఫోర్ మూవీస్ పైనే!
కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్ దశ నుంచే ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇక మేకింగ్ మొదలైన దగ్గర్నుంచీ ఆ సినిమాకు సంబంధించిన ప్రతి వార్తా సంచలనమే. అలాంటి క్రేజీయెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్టులు అరుదుగానే తయారవుతుంటాయి. ప్రస్తుతం దక్షిణాదిలో అలాంటి నాలుగు ఆసక్తికరమైన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. కంటెంట్... కాన్సెప్ట్... కాంబినేషన్స్... మేకింగ్... టేకింగ్... బడ్జెట్... స్టార్ ఇమేజ్... జానర్... వర్కింగ్ స్టయిల్... టెక్నాలజీ... వీటన్నిటి పరంగా ఈ నాలుగు చిత్రాలు ‘టాక్ ఆఫ్ ది సౌత్’ అనిపించుకుంటున్నాయి. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా, అనురక్తిగా వేయి కళ్లతో ఎదురు చూస్తోన్న ఆ నాలుగు సినిమాల విశేషాల సమాహారమిది. బాహుబలి తారాగణం : ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా తదితరులు దర్శకత్వం : ఎస్.ఎస్.రాజమౌళి నిర్మాతలు : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఛాయాగ్రహణం : సెంథిల్ కుమార్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి జానర్ : జానపదం షూటింగ్ ప్రారంభం: 2013 జూలై 6న కర్నూలులో నిర్మాణ వ్యయం : సుమారు రూ. 100 కోట్లు విడుదల : 2015 ప్రత్యేకత : రెండు భాగాలుగా విడుదల ప్రభాస్ ‘మిర్చి’ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమౌళితో సినిమా చేయాలని వేరే కమిట్మెంట్స్ పెట్టుకోలేదు. ఇందులో పాత్రకు తగ్గట్టుగా తన శరీరాకృతిని మార్చుకున్నారు. అనుష్క కూడా అంతే. తన పాత్ర కోసం గుర్రపు స్వారీ, కత్తి సాములో శిక్షణ పొందారు. ఇందులో ప్రభాస్ది ద్విపాత్రాభినయం. ఒక పాత్ర పేరు బాహుబలి కాగా, మరో పాత్ర పేరు శివుడు. బాహుబలి సరసన అనుష్క, శివునికి జోడీగా తమన్నా చేస్తున్నారు. రానా, రమ్యకృష్ణ లాంటి ప్రముఖ తారలు కూడా ఇందులో నటిస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న మేకప్మేన్లు, కాస్ట్యూమర్లు దాదాపుగా ఈ సినిమాకు పని చేస్తున్నారు. కర్నూలు, కేరళ, కర్ణాటకల్లో ఇప్పటి వరకూ షూటింగ్ చేశారు. ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో భారీ షెడ్యూల్ చేస్తున్నారు. డిసెంబర్ 23న మొదలైన ఈ షెడ్యూల్ మార్చి 5 వరకూ జరుగనుంది. ప్రస్తుతం యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ విషయమూ బయటకు పొక్కకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్, అనుష్క, తమన్నా బర్త్‌డేలకు మాత్రం ఫస్ట్‌లుక్, కొంత సమాచారం రిలీజ్ చేశారు. ఈ ఏడాది అంతా ఈ సినిమా వర్క్ నడుస్తుందని సమాచారం. 2015లో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేసే యోచనలో ఉన్నారట రాజమౌళి. తెలుగు, తమిళ భాషల్లో రూపొదుతోన్న ఈ చిత్రాన్ని మలయాళం, హిందీతో పాటు విదేశీ భాషల్లో కూడా అనువదిస్తారు. రుద్రమదేవి తారాగణం : అనుష్క, రానా, నిత్యామీనన్, కృష్ణం రాజు తదితరులు నిర్మాత, దర్శకుడు : గుణశేఖర్ ఛాయాగ్రహణం : అజయ్ విన్సెంట్ సంగీతం : ఇళయరాజా జానర్ : చారిత్రకం షూటింగ్ ప్రారంభం : 2013 ఏప్రిల్ వరంగల్‌లో నిర్మాణ వ్యయం : సుమారు రూ. 40-50 కోట్లు విడుదల : 2014 వేసవిలో ప్రత్యేకత : తొలి భారతీయ చారిత్రక త్రీడీ చిత్రం భారతదేశ చరిత్రలో 40 ఏళ్ల పాటు ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక మహిళ... రాణీ రుద్రమదేవి. ఆమె చరిత్రని చాలా ఇన్‌స్పయిరింగ్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు గుణశేఖర్. 13వ శతాబ్దం తాలూకు కథ కాబట్టి, అప్పటి వాతావరణాన్ని, పరిస్థితుల్ని యధాతథంగా ప్రెజెంట్ చేయడానికి ఎన్నో కసరత్తులు చేస్తున్నారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీతాలుల్లా ఈ టీమ్‌కి మెయిన్ ఎస్సెట్. కళాదర్శకుడు తోట తరణి ఈ సినిమాకు మూలస్తంభం. అద్భుతమైన సెట్లు వేస్తున్నారాయన. అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో వేయిస్తంభాల గుడిని అచ్చు గుద్దినట్టుగా దింపేశారు. అలాగే మొగిలిచెర్ల ఏకవీరాదేవి గుడి, ఏడు కోట గోడలు, అప్పటి పల్లెటూళ్లు, రాజమందిరాలు, దర్బార్లు... వీటన్నిటినీ ఎంతో శ్రద్ధతో సెట్లు వేస్తున్నారు. ఈ సినిమా కోసం సుమారు 60 అడుగుల ఎత్తున్న సెట్ వేశారు. ఆ సెట్లోకి వెళ్లడం కోసం ఏకంగా లిఫ్ట్ ఏర్పాటు చేశారు. అలాగే చిన్న సెటప్‌కి కూడా పేరున్న తారలనే ఎంచుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం దగ్గర ఇటీవలే అనుష్క, రానాపై ఒక పాట, కొన్ని సీన్లు తీశారు. ఈ లొకేషన్లో సినిమా షూటింగ్ జరగడం ఇదే తొలిసారట. ఝ గ్రాఫిక్స్‌కి అధిక ప్రాధాన్యం ఉంది. అసలే త్రీడీ మూవీ కాబట్టి మైన్యూట్ డీటైల్స్ని కూడా వర్కవుట్ చేస్తున్నారు. ఈ సినిమాలో దాదాపుగా ప్రతి సన్నివేశంలోనూ 400, 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉండడం విశేషం. ఇప్పటికి 65 శాతం సినిమా పూర్తయింది. కోచ్చడయ్యాన్ తారాగణం : రజనీకాంత్, దీపికా పదుకొనే, శరత్‌కుమార్, శోభన తదితరులు దర్శకత్వం : సౌందర్య, ఆర్.అశ్విన్ నిర్మాతలు : సునందమురళీమనోహర్, సునీల్ లుల్లా ఛాయాగ్రహణం : రాజీవ్ మీనన్ సంగీతం : ఎ.ఆర్. రెహమాన్ జానర్ : జానపదం షూటింగ్ ప్రారంభం: 2012 మార్చి నిర్మాణ వ్యయం : సుమారు రూ. 125 కోట్లు విడుదల : 2014 ఏప్రిల్ 10న ప్రత్యేకత : తొలి భారతీయ త్రీడీ మోషన్ కాప్చర్ కంప్యూటర్ యానిమేటెడ్ చిత్రం ‘రోబో’ తర్వాత కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రాణా’ సినిమా చేయాలనుకున్నారు రజనీకాంత్. ప్రారంభ వేడుక కూడా జరిగింది. అయితే రజనీ ఆ తర్వాత అనారోగ్యం పాలవ్వడంతో ‘రాణా’ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత రజనీ పెద్ద కూతురు సౌందర్య ‘కోచ్చడయాన్’ సినిమా అనౌన్స్ చేశారు. ‘రాణా’ కథకి ప్రీక్వెల్ ఇదని ఆమె ప్రకటించారు కూడా. జేమ్స్ కేమరూన్ సృష్టించిన ‘అవతార్’ హాలీవుడ్ చిత్రం తరహాలో త్రీడీ మోషన్ కాప్చర్ కంప్యూటర్ యానిమేషన్ పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇండియాలో ఈ పరిజ్ఞానంతో తీసిన తొలి సినిమా ఇదే. రజనీకాంత్ ఫేస్‌ని స్కాన్ చేయగా వచ్చిన రూపంతో త్రీడీలో ఓ మోడల్ తయారు చేశారు. ఆ మోడల్ స్కిన్‌ని టైట్ చేస్తే ‘ముత్తు’లో రజనీలాంటి రూపం వచ్చింది. రజనీ ఇందులో మూడు యానిమేటెడ్ పాత్రల్లో కనిపిస్తారు. మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్న నీతాలుల్లా కాస్టూమ్స్ డిజైన్ చేశారు. ఇందుకోసం 8 నెలలు కసరత్తులు చేశారు. రజనీ యుద్ధ వీరుడి గెటప్ కోసమైతే దాదాపు 30 స్కెచ్‌లు వేశారామె. ఝ తమిళనాడుకి చెందిన పాండ్యవంశ రాజు ‘కోచ్చడయ్యాన్ రణబీరన్’ జీవిత చరిత్రకు కొంత కాల్పనికతను జోడించి ఈ కథ తయారు చేశారు. మలయాళం, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, ఇటాలియన్, స్పానిష్ భాషల్లో ఈ చిత్రం అనువాదం కానుంది. ఝ 2013 ఫిబ్రవరికే చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్‌కే ఇంత సమయం పట్టింది. లండన్, హాంకాంగ్, లాస్ఏంజిల్స్, చైనాల్లో ఫైనల్ వర్క్ జరుగుతోంది. ఝ తెలుగులో ‘విక్రమ సింహ’ పేరుతో శ్రీ లక్ష్మీగణపతి ఫిలింస్ సంస్థ విడుదల చేయనుంది. ఐ తారాగణం : విక్రమ్, అమీ జాక్సన్ తదితరులు దర్శకత్వం : శంకర్ నిర్మాత : ఆస్కార్ వి.రవిచంద్రన్ ఛాయాగ్రహణం : పి.సి.శ్రీరామ్ సంగీతం : ఎ.ఆర్. రెహమాన్ జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్ షూటింగ్ ప్రారంభం : 2012 జూలై 15న నిర్మాణ వ్యయం : సుమారు రూ. 145 కోట్లు విడుదల : 2014 ఏప్రిల్ 11న ప్రత్యేకత : 17 భాషల్లో అనువాదం ‘అపరిచితుడు’ తర్వాత శంకర్, విక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. హిందీ ‘త్రీ ఇడియట్స్’ని తమిళంలో ‘నన్బన్’గా రీమేక్ చేసి పరాజయం పొందిన శంకర్ ఓ కసితో ఈ సినిమా చేస్తున్నారు. ఝ వరుస పరాజయాలు, ప్రయోగాలతో వెనుకబడిపోయిన విక్రమ్ ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వేరే అవకాశాలు కూడా వదిలేసుకుని అహరహం శ్రమిస్తున్నారు. పలురకాల శరీరాకృతుల్లో కనిపించడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. తొలుత సమంతను నాయికగా అనుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె ఈ అవకాశం వదులుకోవడంతో, అమీజాక్సన్‌ని ఎంచుకున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్, అవతార్‌లాంటి హాలీవుడ్ చిత్రాలకు స్పెషల్ మేకప్ చేసిన వీటా వర్క్ షాప్ సంస్థ వాళ్లు విక్రమ్‌కి మేకప్ చేశారు. వరల్డ్‌లోనే ఎక్స్లెంట్ మేకప్ టీమ్ ఇదని శంకర్ స్వయంగా పేర్కొన్నారు. హాలీవుడ్ ‘మెన్ ఇన్ బ్లాక్’ చిత్రాల సిరీస్‌కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన మేరీ ఓగ్ దీనికి పనిచేశారు. మన ఇండియన్ అనల్ అరసుతో పాటు చైనాకు చెందిన పీటర్ మింగ్ కొరియోగ్రఫీ చేశారు. ‘హ్యారీపోటర్’ సిరీస్‌కి పనిచేసిన ఆస్ట్రేలియన్ రైజింగ్‌సన్ పిక్చర్స్ వాళ్లు గ్రాఫిక్స్ సమకూరుస్తున్నారు. ‘ఐ’ అంటే తమిళంలో అందం, రాజు, గురువు, సున్నితం అని అర్థాలున్నాయి. తెలుగులో ‘మనోహరుడు’ పేరుతో విడుదల కానుంది. -
రజనీకాంత్ ‘కోచడయాన్’ రెడీ
ఇదిగో వస్తోంది... అదిగో వచ్చేస్తోంది అంటూ గత రెండేళ్లుగా ‘కోచడయాన్’ చిత్రం ప్రేక్షకులతో దోబూచులాడుతోంది. అయితే, ఈ ఏడాదితో ఆ దోబూచులాటకు ఫుల్స్టాప్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే, తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణను ప్రేమికుల దినోత్సవం మర్నాడు అంటే ఫిబ్రవరి 15న జరపాలనుకుంటున్నారట. ఆడియో విడుదల హక్కులను సోనీ మ్యూజిక్ దక్కించుకుందని వినికిడి. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వైభవంగా జరపడానికి ఆ సంస్థ ప్లాన్ చేస్తోందట. రజనీకాంత్ హీరోగా ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీ సరసన దీపికా పదుకొనె కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, శరత్‌కుమార్, శోభన, ఆది తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఎ.ఆర్. రహమాన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం తెలుగులో ‘విక్రమసింహా’ పేరుతో విడుదల కానుంది. ఇంకా హిందీతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు. -
సంక్రాంతి బరిలో సూపర్‌స్టార్
ఒక ప్రాంతీయ నటుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకోవడం, బాలీవుడ్ సూపర్స్టార్లను సైతం అభిమానులుగా మార్చుకోవడం రజనీకాంత్ విషయంలోనే జరిగింది. ప్రాంతీయ భాషా చిత్రాలకు ఓ గౌరవం తెచ్చిన నటుడు రజనీకాంత్. ఈ రోజున ఆయన సినిమా విడుదల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ ‘కోచ్చడయాన్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అవతార్, ది అడ్వంచర్ ఆఫ్ టైటాన్ చిత్రాలకు ఉపయోగించిన మోషన్ క్యాప్యరింగ్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని రూపొందించారు సౌందర్య. దేశంలో ఈ టెక్నాలజీతో రూపొందుతోన్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఇందులో రజనీ పరాక్రమశాలిగా కనిపిస్తారు. ఆయన పాత్రకు తగ్గట్టుగా తెలుగులో ఈ చిత్రం ‘విక్రమసింహ’ పేరుతో విడుదల కానుంది. లక్ష్మీ గణపతి ఫిలింస్ సంస్థ తెలుగు హక్కుల్ని చేజిక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్‌స్టార్ అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఈ చిత్రంలో రజనీ స్టైల్ కొత్త పుంతలు తొక్కనుందని తెలిసింది. అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర చిత్రణ ఉండబోతోందని వినికిడి. ఏఆర్ రెహమాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా విడుదల కానుంది. అంటే... మహేష్‌బాబు ‘1’, బన్నీ ‘రేసుగుర్రం’, నితిన్ ‘హార్ట్ఎటాక్’, సాయిధరమ్‌తేజ్ ‘రేయ్’ చిత్రాలకు సూపర్‌స్టార్ రూపంలో గట్టి పోటీ ఎదురు కానున్నదన్నమాట. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో రజనీ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి. కె.ఎస్.రవికుమార్ కథ అందించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయిక. శరత్‌కుమార్, ఆది, శోభన్ ప్రత్యేక పాత్రధారులు. నాజర్, జాకీష్రాఫ్, రుక్మిణి ఇతర పాత్రధారులు. -
ఒకే రోజున రజనీ, కమల్ చిత్రాల రిలీజ్
సూపర్‌స్టార్ రజనీకాంత్, పద్మశ్రీ కమల్ హాసన్ చిత్రాలు ఒకే రోజున తెరపైకొస్తే ఎలా ఉంటుంది. రసవత్తరంగా ఉంటుందంటున్నారు పంపిణీదారులు. అయితే అలాంటి అవకాశం ఉందా? అంటే, సరైన సమాచారం ఎవ్వరికీ చిక్కడం లేదు. రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కోచ్చడయాన్’. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. త్రీడీ మోషన్ కాప్చరింగ్ పరిజ్ఞానంతో హాలివుడ్ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని రజనీ పుట్టిన రోజైన డిసెంబరు 12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చరిత్రాత్మక భారీ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాగా కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వరూపం-2’. ఆండ్రియా, పూజాకుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పాటలను వచ్చే నెలలోను, చిత్రాన్ని డిసెంబరులోనూ విడుదల చేయడానికి కమల్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే రెండు భారీ చిత్రాలను ఒకేసారి విడుదల చేయడం సరైన విధానమేనా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వస్తుంది. ఇప్పుడు మాత్రం రజనీ, కమల్ చిత్రాలు ఒకే రోజునే విడుదల చేయాలనే ఆకాంక్షను పంపిణీదారులు వ్యక్తం చేస్తున్నారు. అందుకు వారు చెప్పే కారణం ఇతర స్టార్ హీరోల చిత్రాలకు, రజనీ, కమల్ చిత్రాలకు వ్యత్యాసం ఉంటుందన్నదే. ఇతర హీరోల చిత్రాలు ఒకేసారి విడుదలయితే వాటిలో బాగున్న చిత్రమే థియేటర్లలో నిలబడుతుందటున్నారు. రజనీ, కమల్ చిత్రాలు అలా కాదని, ఎన్నో అంచనాలతో కూడిన ఈ చిత్రాలు హౌస్‌ఫుల్‌గా ప్రదర్శితం కావడం ఖాయం అని అంటున్నారు. అదేవిధంగా తమిళనాడులోని 700 థియేటర్లలోనూ ఈ రెండు చిత్రాలనే ప్రదర్శించవచ్చునని పేర్కొంటున్నారు. ఇతర హీరోల చిత్రాలకు ఇది సాధ్యం కాదంటున్నారు. చూద్దాం... ఏం జరుగుతుందో!? -
అంతర్జాతీయ చిత్రం 'కోచడయాన్'
తన తదుపరి చిత్రం దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కలిసిన నటించిన 'కోచడయాన్' విడుదలకు సిద్దంగా ఉన్నట్లు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే చెప్పారు. ఈరోజు ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఇది తమిళ చిత్రం కాదని అంతర్జాతీయ చిత్రం అని తెలిపారు. ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, రష్యా, జపాన్, చైనా భాషలలో విడుదలవుతుందని చెప్పారు. రజినీకాంత్ అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న నటుడని తెలిపారు. ఈ చిత్రాన్ని 3డిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో అద్భుతంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు ఏ భారతీయ చిత్రంలో లేనటువంటి యానిమేషన్ దృశ్యాలు ఇందులో ఉంటాయని దీపిక వివరించారు. భారీ బడ్జెట్, భారీ తారాగణం నటించిన 'కోచడయాన్' తొలికాపీ సిద్ధమైంది. అంతర్జాతీయంగా వివిధ భాషల్లో ఒకే రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో ఆధ్యాత్మికతను మేళవించి కూతురు సౌందర్య దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో సూపర్‌స్టార్ నటవిశ్వరూపం చూపించారని వినికిడి. రజనీకాంత్, దీపికా పదుకొనే జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వ పర్యవేక్షణలో సౌందర్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడు పాత్రలో జాకీ ష్రాఫ్, ప్రత్యేక పాత్రలో శోభన, ఇంకా శరత్ కుమార్, ఆది పినిశెట్టి, నాసర్, రుక్మిణి, విజయకుమార్ నటించారు. ఈరోస్ ఇంటర్నేషనల్, మీడియా వన్ గ్లోబర్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి నిర్మాత మురళీ మనోహర్. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. తెలుగులో దీనిని‘విక్రమ సింహా' పేరుతో విడుదల చేస్తారని తెలుస్తోంది. రజనీకాంత్ విభిన్న తరహాలలో కనిపించే పోస్టర్లు ఇప్పటికే అభిమానులో ఆసక్తి పెంచాయి. రజనీకాంత్ నటించిన చివరి చిత్రం ‘రోబో' 2010లో విడుదలైంది. ఆ తరువాత ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆశగా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఏడాది క్రితమే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. చెన్నై, లండన్లలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగాయి. తొలి కాపీని తమిళ దర్శకుడు రవికుమార్‌తో కలిసి రజనీకాంత్ చూశారు. ఊహించినదానికంటే సినిమా చాలా రిచ్‌గా వచ్చిందని రజనీకాంత్ రవికుమార్‌ను ప్రశంసించారు. ‘‘నా జీవితంలో మరచిపోలేని రోజు ఇది. నాన్నగారు, రవికుమార్ అంకుల్, ఇతర టీమ్ సభ్యులు ఈ సినిమా మొదటి కాపీ చూసి, చాలా థ్రిల్ అయ్యారు’’ అని సౌందర్య ట్విట్టర్లో పెట్టారు. ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు లండన్ లోని పీనివుడ్స్ స్టూడియోలో జరిగినట్లు తెలిపారు. ఈ చిత్రం నవంబర్‌లో విడుదలవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకతలు 'కోచడయాన్'కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ‘మోషన్ కాప్చరింగ్’ టెక్నాలజీతో 3డీలో రూపుదిద్దుకుంటున్న తొలి భారతీయ సినిమా. ఆసియాలోనే తొలి మోషన్ క్యాప్చర్ సినిమా ఇది. కోట్ల రూపాయలు ఖర్చుచేసి అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని నిర్మించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటి వరకు అవతార్, అడ్వెంచర్స్ ఆఫ్ టిన్ టిన్... రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. మొత్తం 48 కెమెరాలతో ఈ సినిమా షూటింగ్ జరిపారు. అంటే ఒక్కో దృశ్యాన్ని 48 కోణాల్లో చిత్రీకరించారు. చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో నటించేందుకు చెన్నై ప్రభుత్వ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి 42 మంది విద్యార్థులను, కుంభకోణం ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి 50 మంది విద్యార్థులను సౌందర్య ఎంపిక చేశారు. ఈ సినిమాకు మరో విశేషం ఏంటంటే జీవితసారాన్ని తెలియజెప్పే ఓ అద్భుతమైన పాటను రజినీకాంత్ ఇందులో పాడారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతంలో రూపొందించిన ఈ పాటను వైరముత్తు రాశారు. 1992లో తమిళ సినిమా మన్నన్ కోసం రజినీ మొదటిసారి పాటపాడారు. ఆయన పాడిన రెండో పాట ఇది. హిందీ వెర్షన్లోనూ ఆయనే పాడారు. రజనీ జపాన్ అభిమానుల ముచ్చట తీర్చేవిధంగా కొన్ని ప్రత్యేక దృశ్యాలను కూడా చిత్రీకరించారు. రజనీ కాంత్ స్థాయికి తగిన రీతిలో ఈ సినిమా అంతర్జాతీయంగా మార్కెట్ అవుతోంది.