
నేటి నుంచి కోచ్చడయాన్ టికెట్ రిజర్వేషన్
కోచ్చడయాన్ చిత్ర టికెట్ రిజర్వేషన్ బుకింగ్ కోలాహలం మొదలు కానుంది. సూపర్‌స్టార్ రజనీ కాంత్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం కోచ్చడయాన్.
కోచ్చడయాన్ చిత్ర టికెట్ రిజర్వేషన్ బుకింగ్ కోలాహలం మొదలు కానుంది. సూపర్‌స్టార్ రజనీ కాంత్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం కోచ్చడయాన్. ఈ చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ నెల 23కు విడుదల వాయిదా పడింది. ఆరు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా కోచ్చడయాన్ ఆరువేల థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఒక్క తమిళనాడులోనే 450 థియేటర్లలో ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆరువేలకు పైగా థియేటర్లలో చిత్రం విడుదలకానుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. కోచ్చడయాన్ చిత్రం ఈ నెల 9న విడుదల కానున్నట్లు గతంలో ప్రకటించారు. అప్పుడు చెన్నైలో కేవలం రెండు గంటల వ్యవధిలోనే లక్షా 25 వేల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. ఆ తరువాత చిత్రం వాయిదా పడడంతో మళ్లీ ఆదివారం నుంచి అడ్వాన్స్ బుకింగ్ మొదలు కానుంది.