
కోచ్చడయూన్‌కు ప్రశంసల జల్లు
మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డి ఫార్మెట్‌తో తెరకెక్కిన తొలి భారతీయ సినిమా కోచ్చడయాన్.
మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డి ఫార్మెట్‌తో తెరకెక్కిన తొలి భారతీయ సినిమా కోచ్చడయాన్. నలుపు, తెలుపు చిత్రాల నుంచి ఈస్ట్‌మన్ కలర్, 70 ఎంఎం, స్టీరియో సోనిక్ చిత్రాల వరకు నటించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీ 3డీ చిత్రంలో నటించిన తొలి భారతీయ నటుడుగా ఖ్యాతిగాంచారు. ఆయన రెండో కుమార్తె సౌందర్య తొలి ప్రయత్నంలోనే అద్భుత సాంకేతిక విలువలతో తెరకెక్కించి సఫలబయ్యారు. అలాంటి కోచ్చడయాన్ చిత్రం అంతర్జాతీయ సినీ ప్రముఖులను సైతం అలరించింది.
గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో నవంబర్ 21న కళా అకాడమీలో గల ప్రదర్శన హాలులో కోచ్చడయాన్ ప్రదర్శితమైంది. 950 మంది సినీ ప్రియులతోపాటు పలు దేశాల సినీ దిగ్గజాలు తిలకించి కోచ్చడయాన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇంతటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రాన్ని తెరకెక్కించిన తొలి మహిళా దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లతా రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌లను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.