‘జైలర్‌ 2’​కి రజనీకాంత్‌ కుటుంబం.. వేర్వేరు కార్లలో ధనుష్‌.. ఐశ్వర్య | Actor Dhanush Watches Rajinikanth Jailer 2 Movie In Chennai | Sakshi
Sakshi News home page

‘జైలర్‌ 2’​కి వేర్వేరు కార్లలో వచ్చిన ధనుష్‌.. ఐశ్వర్య

Oct 15 2026 3:04 PM | Updated on Oct 15 2026 3:24 PM

Actor Dhanush Watches Rajinikanth Jailer 2 Movie In Chennai

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్‌ 2’ ఈ రోజు విడుదలైంది. థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. అయితే ఈ సినిమా చూసేందుకు చెన్నైలోని రోహిణి థియేటర్‌కు రజనీకాంత్‌ భార్య లత, కుమార్తె ఐశ్వర్యతో పాటు హీరో ధనుష్‌ కూడా వచ్చారు. అయితే ధనుష్‌, ఐశ్వర్య వేర్వేరు కార్లలో థియేటర్‌కు చేరుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

కాగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, మోహన్‌లాల్‌, రమ్యకృష్ణ, విద్యాబాలన్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

కథేంటంటే.. 
విగ్రహాల అక్రమ వ్యాపారం చేస్తున్న వర్మ(వినాయకన్)ని, అతనితో చేతులు కలిపిన కొడుకు ఏసీపీ అర్జున్‌(వసంత్‌ రవి)  ని రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండ్యన్ (రజనీకాంత్) తుది ముట్టించడంతో ‘జైలర్‌’ సినిమా ముగుస్తుంది.  జైలర్‌  2 కథ అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది.  తన కొడుకు చావుకు కారణం అయిన వర్మ వెనుక ఉన్న బాస్‌ ఎవరో తెలుసుకోవాలని ముత్తువేల్‌ పాండ్యన్‌ ప్రయత్నిస్తుంటాడు.  ఇందులో భాగంగానే లోకల్‌ రౌడీ మూర్తి దగ్గర డ్రైవర్‌గా చేరి.. అతని ద్వారా దిలీప్‌ (సురాజ్ వెంజారమూడు)ని కలుస్తాడు.  దిలీప్‌ ద్వారా వర్మ బాస్‌  బోధి (ఎస్.జె. సూర్య) గురించి తెలుసుకోవాలనుకుంటాడు. మరి ఆ ప్రయత్నం ఫలించిందా? బోధి అక్రమ వ్యాపారాలను మత్తువేల్ పాండ్యన్ ఎలా కూల్చాడు? ఈ క్రమంలో తన స్నేహితులు మాథ్యూ(మోహన్‌ లాల్‌), నరసింహా(శివరాజ్‌ కుమార్‌), రోలీ(హృతిక్‌ రోషన్‌), కామదేవ్‌(జాకీ ష్రాప్‌) ఎలాంటి సహాయం చేశారు? ఈ కథలో చక్రి కల్పక్‌ (మిథున్ చక్రవర్తి), కాంత కల్పక్‌(విద్యాబాలన్‌)  పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

(పూర్తి రివ్యూ : ‘జైలర్‌ 2’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement