లతా రజనీకాంత్‌కు సంబంధం లేదు | Latha Rajinikanth not involved in the Kochadaiyyan battle | Sakshi
Sakshi News home page

లతా రజనీకాంత్‌కు సంబంధం లేదు

Jul 16 2018 7:38 AM | Updated on Jul 16 2018 7:38 AM

Latha Rajinikanth not involved in the Kochadaiyyan battle - Sakshi

తమిళసినిమా: నటుడు రజనీకాంత్‌ సతీమణి లతారజనీకాంత్‌కు మీడియా ఒన్‌ గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ డైరెక్టర్‌ తిరుమూర్తి మోసెస్‌ తెలిపారు. బెంగళూర్‌కు చెందిన యాడ్‌ బ్యూరో సంస్థ మీడియా ఒన్‌ గ్లోబల్‌ సం స్థ, ఆ సంస్థలో భాగస్వామ్యం కలిగిన లతా రజ నీకాంత్‌ల మధ్య కేసులు, కోర్టులు అంటూ చాలా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో యాడ్‌బ్యూరో సంస్థ లతా రజనీకాంత్‌ పై సుప్రీంకోర్టును ఆశ్రయింంచడం, అత్యుత్తమ ధర్మాసనం ఆమె విచారణను ఎదుర్కోవలసిందేనని ఆదేశాలు జారీ చేయడం గురించి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ఒన్‌ గ్లోబల్‌ సంస్థ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అం దులో కొంతకాలంగా లతా రజనీకాంత్‌ గురించి, తమ సంస్థ గురించి మీడియా అసత్య ప్రచారాలు చేస్తోందని పేర్కొన్నారు.

నిజానికి కోచ్చడైయాన్‌ చిత్రానికి లతారజనీకాంత్‌కు, అదే విధంగా తమ సంస్థకు, ఆమెకు ఎలాంటి సంబంధం లేదన్నా రు. కోచ్చడైయాన్‌ చిత్రానికి సంబంధించిన రు ణం విషయం తమ సంస్థకు యాడ్‌బ్యూరో సంస్థ కు సంబంధించిందన్నారు. ఆ సంస్థ తమకు రూ. 20 కోట్ల రుణం ఇవ్వడానికి, అందుకుగానూ చి త్రం తమిళనాడు విడుదల హక్కులను తాము ఇవ్వడానికి ఒప్పందం జరిగిందన్నారు. అయితే యాడ్‌బ్యూరో సంస్థ రూ.10 కోట్లు మాత్రమే చెల్లించిందని, మిగిలిన మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో తమ చిత్ర విడుదల 6 నెలలు ఆలస్యమైందని తెలిపారు. దీంతో తాము యాడ్‌బ్యూరో నుంచి తీసుకున్న రూ.10 కోట్లలో రూ. 9.2 కోట్లు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. అయితే యాడ్‌ బ్యూరో సంస్థ 2014 నవంబర్‌ 11న తమ సంస్థకు రాసిన లేఖలో ఒప్పందం మీరిన కారణంగా అసలు రూ.10 కోట్లతో వడ్డీ రూ. 4.30కోట్లు,  మరో ఆరు నెలలు ఆలస్యం కావడంతో 80 శాతం వడ్డీ కలిపి చెల్లిం చాల్సిం దిగా పేర్కొందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement