కోచ్చడయాన్ విడుదలకు చిక్కులా? | Obstacles on Kochadaiyaan cinema release | Sakshi
Sakshi News home page

కోచ్చడయాన్ విడుదలకు చిక్కులా?

Apr 25 2014 8:47 AM | Updated on Sep 2 2017 6:31 AM

కోచ్చడయాన్ విడుదలకు చిక్కులా?

కోచ్చడయాన్ విడుదలకు చిక్కులా?

కోచ్చడయాన్ చిత్రం విడుదలకు చిక్కులా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే.

కోచ్చడయాన్ చిత్రం విడుదలకు చిక్కులా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే. సూపర్‌స్టార్ రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం కోచ్చడయాన్. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకునే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు కె ఎస్ రవికుమార్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించారు. రజనీ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్, అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హిందీ నటుడు జాకీష్రాఫ్, శరత్‌కుమార్, ఆర్తి, నటి శోభన వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలను పోషించారు.
 
 మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డీ ఫార్మెట్‌లో రూపొందిన తొలి భారతీయ చిత్రం కోచ్చడయాన్. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చిత్ర విడుదల ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఈసారి మాత్రం నిర్మాతలు మే నెల తొమ్మిదిన విడుదలవుతుందని స్పష్టంగా ప్రకటించారు. అయితే తాజాగా చిత్ర విడుదలకు చిక్కులేర్పడుతున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. చిత్ర నిర్మాతకు, పంపిణీదారుడికి మధ్య ఆర్థిక సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ఈ విషయమై చర్చలు వాడివేడిగా జరుగుతున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ విషయమై డిస్ట్రిబ్యూటర్స్ సంఘం కార్యదర్శి జయకుమార్ మాట్లాడుతూ భారీ చిత్రాల విడుదల సమయాల్లో థియేటర్ల టికెట్ల ధర ఎవరికెంత శాతం చెందాలన్న విషయాలపై చర్చ జరగడం సహజం అన్నారు.
 
 ఇలాంటి చర్చనే ప్రస్తుతం కోచ్చడయాన్ చిత్ర విషయంలో జరుగుతోందని పేర్కొన్నారు. సుదీర్ఘ చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. చిత్రం ప్రకటించిన విధంగానే మే నెల తొమ్మిదిన విడుదలవుతుందనే అభిప్రాయాన్ని జయకుమార్ వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారం గురించి నిర్మాతల తరపు నుంచి ఎలాంటి వివరణ వెలువడలేదు. దీంతో కోచ్చడయాన్ విడుదలపై రకరకాల ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement