
కేతిరెడ్డి జగదీశ్వరర్ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డికి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మోహన్‌రెడ్డికి పలు సమ స్యలను విజ్ఞప్తి చేశారు. కేతిరెడ్డి మాట్లాడుతూ –‘‘తమిళనాడులోని తెలుగు విద్యార్థుల సమస్యలను అక్కడి ప్రభుత్వంతో సమాలోచన జరిపి తెలుగువారి సమస్యలను తీర్చాలి. ఒక బృందాన్ని తమిళనాడు పంపి వారి సమస్యలు తెలుసుకోవాలి. అలాగే తెలుగు సినిమాల షూటింగ్ 50 శాతం వరకూ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విధంగా చర్యలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్న నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అన్ని రకాల వసతులు కల్పించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.