అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా.. ‘కపిల్‌’ కూతురు | Kapil Dev‘s Daughter Amiya Dev Assistant Director Of 83 Movie | Sakshi
Sakshi News home page

దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ‘హరికేన్‌’ డాటర్‌

Mar 26 2019 1:29 PM | Updated on Mar 26 2019 2:11 PM

Kapil Dev‘s Daughter Amiya Dev Assistant Director Of 83 Movie - Sakshi

ఎన్నో ఏళ్ల కలగా మారిన క్రికెట్‌ వరల్డ్‌కప్‌ను 1983లో కపిల్‌దేవ్‌ నాయకత్వంలోని టీమిండియా తొలిసారి గెలుచుకుంది. ఈ సంచలన విజయాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం ‘83. భారీ అంచనాలతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటిస్తు‍ండగా.. క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ కూతురు అమియాదేవ్‌ ఈ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 23 సంవత్సరాల చిన్న వయసులోనే కబీర్‌ ఖాన్‌ వద్ద దర్శకత్వ శాఖలో పని చేయడం ఆమెకు గొప్ప అనుభవాన్ని మిగుల్చుతుందని కపిల్‌దేవ్‌ ఈ సందర్భంగా అభిలషించారు. 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న ఈ చిత్రం ద్వారా అమియా తన నైపుణ్యానికి పదును పెడుతోంది. కాస్ట్యూమ్స్‌ నుంచి షెడ్యూల్స్‌ వరకు అన్నింటినీ దగ్గరుండి మరీ పరిశీలిస్తోంది. క్రికెటర్‌ సందీప్‌ పాటిల్‌ పాత్రలో నటిస్తున్న ఆయన కుమారుడు చిరాగ్‌ పాటిల్‌ మాట్లాడుతూ ‘అమియా దేవ్‌ను మొదటిసారి షూటింగ్‌ స్పాట్‌లోనే కలిశా. తను నా కన్నా వయసులో చిన్నదైనా, పనిపట్ల ఎ‍ంతో అంకితభావం కలది’ అని ప్రశంసించారు. కప్‌ సాధించిన ఆటగాళ్ల పాత్రల్లో నటించనున్న వారిని సినిమా టీమ్‌ 10 రోజులపాటు ధర్మశాల తీసుకెళ్లనుంది. అక్కడ వారికి శిక్షణనివ్వడమే కాక వారిలో స్ఫూర్తి కలిగించడమే ట్రిప్‌ ముఖ్యోద్దేశమని తెలుస్తోంది. సాఖిబ్‌ సలీమ్‌, అమ్రీ విర్క్‌, పంకజ్‌ త్రిపాఠి, సాహిల్‌ ఖట్టర్‌, హార్దీ సంధు, తాహిర్‌ రాజ్‌ భాసిన్‌ లాంటి నటులు సినిమాలోని మిగిలిన క్రికెటర్ల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న విడుదలవుతుందని సినిమా యూనిట్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement