breaking news
Assistant Director of the film
-
అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. ‘కపిల్’ కూతురు
ఎన్నో ఏళ్ల కలగా మారిన క్రికెట్ వరల్డ్‌కప్‌ను 1983లో కపిల్‌దేవ్ నాయకత్వంలోని టీమిండియా తొలిసారి గెలుచుకుంది. ఈ సంచలన విజయాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం ‘83. భారీ అంచనాలతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ కూతురు అమియాదేవ్ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 23 సంవత్సరాల చిన్న వయసులోనే కబీర్ ఖాన్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేయడం ఆమెకు గొప్ప అనుభవాన్ని మిగుల్చుతుందని కపిల్‌దేవ్ ఈ సందర్భంగా అభిలషించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం ద్వారా అమియా తన నైపుణ్యానికి పదును పెడుతోంది. కాస్ట్యూమ్స్ నుంచి షెడ్యూల్స్ వరకు అన్నింటినీ దగ్గరుండి మరీ పరిశీలిస్తోంది. క్రికెటర్ సందీప్ పాటిల్ పాత్రలో నటిస్తున్న ఆయన కుమారుడు చిరాగ్ పాటిల్ మాట్లాడుతూ ‘అమియా దేవ్‌ను మొదటిసారి షూటింగ్ స్పాట్లోనే కలిశా. తను నా కన్నా వయసులో చిన్నదైనా, పనిపట్ల ఎంతో అంకితభావం కలది’ అని ప్రశంసించారు. కప్ సాధించిన ఆటగాళ్ల పాత్రల్లో నటించనున్న వారిని సినిమా టీమ్ 10 రోజులపాటు ధర్మశాల తీసుకెళ్లనుంది. అక్కడ వారికి శిక్షణనివ్వడమే కాక వారిలో స్ఫూర్తి కలిగించడమే ట్రిప్ ముఖ్యోద్దేశమని తెలుస్తోంది. సాఖిబ్ సలీమ్, అమ్రీ విర్క్, పంకజ్ త్రిపాఠి, సాహిల్ ఖట్టర్, హార్దీ సంధు, తాహిర్ రాజ్ భాసిన్ లాంటి నటులు సినిమాలోని మిగిలిన క్రికెటర్ల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదలవుతుందని సినిమా యూనిట్ తెలిపింది. -
అసిస్టెంట్ డైరెక్టర్ మృతిపై అనుమానాలు
భాగ్యనగర్ కాలనీ: సినీ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం సీఐ పురుషోత్తమ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లాకు చెందిన విక్రమ్ చైతన్య (32) మూసాపేటలోని రెయిన్బో విస్తాలో గత ఏప్రిల్ నుంచి తల్లి విజయకుమారి, తమ్ముడు వివేక్‌తో కలిసి ఉంటూ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి మద్యం తాగి ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చాడు. తాను ఉంటున్న ఇంటి రెండో అంతస్తుపై నుంచి కిందపడి చైతన్య మృతి చెంది ఉండగా.. రాత్రి 2 గంటలకు సెక్యూరిటీ గార్డు గమనించి మృతుడి తల్లికి తెలియజేశాడు. మద్యం మత్తులో రెండో అంతస్తుపై నుంచి పడిపోయాడా లేక ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.